విద్యారంగంలో సరిహద్దుల్లేవు
Sakshi Education
గ్లోబలైజేషన్, అకడమిక్ ఒప్పందాలు వంటి కారణాలతో విద్యా రంగంలో సరిహద్దులు తొలగిపోయాయి. మన విద్యార్థులు టీంవర్క్, కొలాబరేటివ్ లెర్నింగ్‌ను అలవర్చుకుంటే ప్రపంచం నలుమూలల్లో ఎక్కడైనా రాణించగలరు. సిలికాన్ వ్యాలీలో పలు సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థానాలు చేరుకుంటున్న భారతీయులే ఇందుకు నిదర్శనం’ అంటున్నారు కాలిఫోర్నియాలోని ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ-దక్షిణాసియా విభాగం రిక్రూట్‌మెంట్ డెరైక్టర్ సుమన్ భార్గవ. విదేశీ విద్య అవకాశం ఆశించిన వారందరికీ అందకపోయినా.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు భార్గవ. కాలిఫోర్నియాలోని ఐటీయూలో 2008లో ఎంబీఏ విద్యార్థిగా అడుగుపెట్టి, అక్కడే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో మార్కెటింగ్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అదే యూనివర్సిటీ దక్షిణాసియా విభాగం రిక్రూట్‌మెంట్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుమన్ భార్గవతో ఇంటర్వ్యూ..
ఉత్తమంగా రాణిస్తున్నారు
విదేశీ విద్య ఔత్సాహికులు ఆందోళన చెందే అంశం.. అక్కడ మనం రాణించగలమా? అని! ఇలాంటి సందేహంతోనే అకడమిక్ నైపుణ్యాలు, ఇతర అర్హతలు ఉన్నప్పటికీ చాలా మంది చక్కటి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీలోని పలు సంస్థల్లో భారతీయు విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల, సిస్కో సీటీఓగా నియమితులైన పద్మశ్రీ వారియర్ వంటి వారే ఇందుకు నిదర్శనం.
అవగాహన పెంచుకోవాలి
ఇప్పుడు మన విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా అంతర్జాతీయంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యం గా అమెరికాలో ఎన్నో యూనివర్సిటీలు కల్చరల్ డైవర్సిటీ పేరుతో విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని ఆరు కోర్సుల్లో దాదాపు 30 దేశాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా తొలి ట్రైమిస్టర్ లేదా సెమిస్టర్‌లో ప్రతిభ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నాయి. కానీ సమస్య అంతా మన విద్యార్థులకు సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లు, వాటిలో లభించే కోర్సుల గురించి అవగాహన లేకపోవడమే. మన విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా తమ అర్హతలకు సరితూగే కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ల సమాచారం తెలుసుకోవాలి.
ఈ రెండు లక్షణాలతో మరింత ఉన్నతంగా
విద్యార్థులు అకడమిక్‌గా రాణించాలంటే ముఖ్యంగా రెండు లక్షణాలు అవసరం. అవి.. టీం వర్క్, కొలాబరేటివ్ లెర్నింగ్. దీనివల్ల తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన లభించడంతోపాటు, తమలోని లోటుపాట్లు కూడా తెలుస్తాయి. ఇంకా రాణించాల్సిన అంశాల గురించి స్పష్టత వస్తుంది.
అకడమిక్ ఒప్పందాలతో నైపుణ్యాలు
కేవలం పుస్తకాలు, లేబొరేటరీలకే పరిమితమైతే ఆశించిన ఫలితాలు లభించడం కష్టం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో దీటుగా రాణించాల్సిన అవసరముంది. అందుకు అకడమిక్ ఒప్పందాలు చక్కని మార్గం. వీటి ద్వారా ఇటు విద్యార్థులకు, అటు ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా బహువిధాల పరిజ్ఞానం లభిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలోని ఒక విద్యాసంస్థ, అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకుంటే.. అమెరికాలోని అకడమిక్ విధానాలు, అక్కడి పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఆ ఇన్‌స్టిట్యూట్‌లు వ్యవహరిస్తున్న తీరుపై అవగాహన లభిస్తుంది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి కూడా ఉపయుక్తం.
యంగ్ టాలెంట్‌కు కేరాఫ్ భారత్
ఇటీవల కాలంలో చాలా విదేశీ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ముఖ్యంగా అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లు భారతదేశంలోని ఐఐటీల నుంచి టైర్-1, 2 స్థాయిల్లోని ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. మనదేశంలో ఉన్న యంగ్ టాలెంటే ఇందుకు కారణం. పనిలో ఇమిడేతత్వం, నిబద్ధత విషయంలో భారతీయులు ఒకడుగు ముందుంటారనే అభిప్రాయం అమెరికా పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. అందుకే అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు అకడమిక్ ఒప్పందాల మార్గంలో భారతీయ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. నేరుగా విదేశీ విద్య కలను నెరవేర్చుకోలేని విద్యార్థులకు ఈ అకడమిక్ ఒప్పందాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ఒక కోర్సు వ్యవధిలో నిర్దిష్ట కాల పరిమితిలో అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. ఉన్న కొద్ది రోజుల్లోనే అక్కడి అవకాశాలు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకొని తమను తాము తీర్చిదిద్దుకోవచ్చు. భవిష్యత్తులో అక్కడ తిరిగి అడుగుపెట్టడానికి కూడా ఆస్కారం లభిస్తుంది.
ఓపెన్‌నెస్.. రెండు దేశాల మధ్య తేడా ఇదే
విద్యా విధానానికి సంబంధించి అమెరికా, భారత్‌ల మధ్య తేడా ‘ఓపెన్‌నెస్’ విధానంలోనే. అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఓపెన్‌నెస్ విధానానికి పెద్దపీట వేస్తారు. ఫలితంగా విద్యార్థులు తమ ఆలోచనలను, సందేహాలను, ఐడియాలను స్వేచ్ఛగా వెల్లడించొచ్చు. ఇలాంటి వాటి ఫలితంగా ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీల యాజమాన్యాలు కూడా తమ బోధన విధానంలో మార్పులు చేస్తుంటాయి. అదే విధంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఇండస్ట్రీ వర్గాలతోనూ నిరంతరం సంప్రదింపులు సాగిస్తుంటాయి. భారతదేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నాయి. ఓపెన్‌నెస్ విధానం విద్యార్థుల కోణంలో ఎంతో మేలు చేసే సాధనం. తమ ఆలోచనలను, అభిప్రాయాలను బిడియం లేకుండా బయటపెట్టే మార్గంగా ఉంటుంది.
ముందుగానే సిద్ధం కావాలి
ముఖ్యంగా అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు దాదాపు ఏడాదిన్నర ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడి నియంత్రణ సంస్థలు, వాటి గుర్తింపు ఉన్న కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లను అన్వేషించడానికే ఎక్కువ సమయం పడుతుంది. ముందుగా తాము చేరాలనుకుంటున్న కోర్సుపై స్పష్టత తెచ్చుకుని.. ఆ కోర్సు బోధనలో పేరు గడించిన ఇన్‌స్టిట్యూట్‌ల సమాచారం తెలుసుకోవాలి. వాటికి నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో? లేదో పరిశీలించాలి. ఆ తర్వాత నిబంధనల మేరకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
మరో మార్గం మూక్స్
విదేశీ విద్య లక్ష్యాన్ని నేరుగా పొందలేని వారికి మరో మార్గం.. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్). అంతర్జాతీయంగా పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ పలు విభాగాల్లో ఆన్‌లైన్ లెర్నింగ్ విధానంలో వీటిని అందిస్తున్నాయి. ఒక సబ్జెక్ట్ లేదా విభాగానికే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో మూక్స్‌ను అందిస్తూ సర్టిఫికెట్స్ కూడా జారీ చేస్తున్నాయి. వీటికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంటోంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ అవకాశం పొందలేని విద్యార్థులు మూక్స్‌ను మార్గంగా చేసుకుంటే అంతర్జాతీయ సర్టిఫికెట్లు సొంతమవుతాయి.
నిరంతరం నేర్చుకోవాలి
నేటి తరం విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన, అనుసరించాల్సిన అత్యంత ఆవశ్యకమైన అంశం.. రెగ్యులర్ లెర్నింగ్. ‘లెర్నింగ్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ సక్సెస్’. ఈ అభ్యసనం కూడా విభిన్నంగా ఉండాలి. తాము చదివే కోర్సు, రంగానికి సంబంధించి విస్తృత పరిధిలో సమాచారాన్ని పొంది, తద్వారా తాజా నైపుణ్యాలను సొంతం చేసుకునే విధంగా ఉండాలి. శరవేగంగా పోటీ పెరుగుతున్న 21వ శతాబ్దంలో ఈ దృక్పథంతో అడుగులు వేస్తేనే విజయం లభిస్తుంది.

Published date : 08 Dec 2014 06:09PM