పరీక్ష విధానంలో మార్పు రావాలి
Sakshi Education
‘విద్యార్థులను పోటీ ప్రపంచంలో రాణించే విధంగా తీర్చిదిద్దాలంటే సబ్జెక్ట్ నైపుణ్యాలను పరీక్షించే విధానాల్లో మార్పు రావాలి’ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు అభిప్రాయపడ్డారు. ప్లాంట్ బయోసెన్సైస్‌లో హైదరాబాద్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పలు హోదాల్లో 27 ఏళ్ల అనుభవం గడించి తాజాగా వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ పొదిలె అప్పారావుతో గెస్ట్ కాలం...
ప్రస్తుతం యువత పోటీ ప్రపంచంలో రాణించేందుకు విశ్లేషణాత్మక దృక్పథం, అనువర్తనాధారిత దృక్పథం, అప్లికేషన్ ఓరియెంటేషన్ ముఖ్యంగా అవసరం. అయితే వీటిని సొంతగా విద్యార్థులే అలవర్చుకునే పరిస్థితి లేదు. ఇందుకోసం విద్యా సంస్థలు తమ మూల్యాంకన వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి. కొశ్చన్-ఆన్సర్ తరహా విధానంతో విద్యార్థులు సబ్జెక్టును అవగాహన చేసుకునే తీరు మారుతోంది. కేవలం ఉత్తీర్ణతకే ప్రాధాన్యతను ఇస్తూ అనువర్తనాధారంగా ప్రిపేర్ కావటం లేదు. ఈ క్రమంలో విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో మార్పులు చేపట్టాలి.
సీబీసీఎస్ అమలు
ఇటీవల యూజీసీ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను తప్పనిసరి చేసింది. ఇది విద్యార్థులకు మేలు చేకూరుస్తుంది. ప్యూర్ సైన్స్ లాంటి విభాగాల్లో సీబీసీఎస్ సాధ్యపడకపోవచ్చు. పూర్తి భిన్నమైన సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశం తక్కువ. మిగిలిన కోర్సుల విషయంలో విద్యార్థులు తమ ఇష్టం మేరకు కోర్సు ఎంపిక చేసుకునే అవకాశం దొరుకుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ సీబీసీఎస్ అమలు చేస్తుంది.
పరిశోధనలకు అనుకూలంగా..
ఉన్నత విద్య అంటే ముందుగా గుర్తొచ్చేవి పరిశోధనలు. ఇటీవల యువత ఎక్కువగా వీటిపై దృష్టిసారించటం ఆహ్వానించదగిన పరిణామం. సామాజిక అభివృద్ధికి తోడ్పడే పరిశోధనలతో ఎక్కువ సత్ఫలితాలు వస్తాయి. కొన్ని రంగాల్లో నేరుగా సామాజిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్ అండ్ డీ విభాగం లేనప్పటికీ వాటి ప్రభావం పరోక్షంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ సెన్సైస్‌లో చేసే పరిశోధనల ద్వారా సమాజంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
నిబంధనల్లో మార్పులు రావాలి
సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థలతో పోల్చితే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు తక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ సామర్థ్యం ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. నిధుల మంజూరులో ఉన్న నిబంధనల వల్ల వీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. విడతల వారీగా విడుదలయ్యే నిధులకు కూడా పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ మంజూరైతే ఆ మొత్తాన్ని ఒకేసారి జారీ చేస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి అవకాశం కల్పిస్తే పరిశోధనలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది.
ర్యాంకింగ్స్‌తో విద్యార్థులకు మేలు
ఎంహెచ్‌ఆర్‌డీ తాజాగా రూపొందించిన ఇన్‌స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్ విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేకూర్చుతుంది. ఈ ర్యాంకింగ్స్ కేటాయింపు పరంగా ఉన్న ప్రమాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదు. మన దేశంలో అన్ని వర్గాలకు విద్యా ఫలాలు అందాలనే ఉద్దేశంతో పలు రిజర్వేషన్ విధానాలు అమల్లో ఉన్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఔట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ ప్రమాణాన్ని రూపొందించారు. కేటగిరీల వారీగా ర్యాంకింగ్‌స ఇస్తున్నందువల్ల ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్ ఈ విషయంలో అనవసరపు ఆందోళన చెందక్కర్లేదు.
ఒత్తిడికి కారణం
ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరుతున్న విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి అవసరమైన రీతిలో శిక్షణ అందిస్తున్నారు. అయితే వీరికి ఐఐటీ తరహా బోధన పద్ధతులపై అవగాహన కల్పించటం లేదు. దీంతో ఐఐటీల్లో అనుసరించే వినూత్న పద్ధతులకు అనుగుణంగా విద్యార్థులు సర్దుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు పరీక్షించే పద్ధతుల్లో మార్పు రావాలి.
అన్ని కోర్సులకూ ఉజ్వల భవిత
మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనే తపనతో కష్టించి చదివిన విద్యార్థులు ఒకవేళ రాకపోతే నిరుత్సాహపడకూడదు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌లే మంచి కోర్సులని, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీలు వంటివే ఉన్నత ఇన్‌స్టిట్యూట్‌లనే భావన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. ఆధునిక యుగంలో అన్ని కోర్సుల్లోనూ ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు వేసే మార్గాలు ఉన్నాయి. వాటి వైపు దృష్టి సారించాలి.

Published date : 17 Oct 2015 12:07PM