నైపుణ్యాల నగిషీలకు ఎన్‌పీటీఈఎల్
Sakshi Education
‘విద్యా రంగంలో సంప్రదాయ బోధన పద్ధతులతో పాటు ఆన్‌లైన్ కోర్సులు, మూక్స్ వంటి వినూత్న విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్‌పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్) ద్వారా ఎన్నో కోర్సులు ఆన్‌లైన్ విధానంలో అభ్యసించే అవకాశముంది. విద్యార్థులు వీటిని అందిపుచ్చుకోవాలి’ అని సూచిస్తున్నారు ఐఐటీ-చెన్నై మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ప్రొఫెసర్, ఐఐటీ-చెన్నై-ఎన్‌పీటీఈఎల్
కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్. 15ఏళ్లుగా బోధన రంగంలో అనుభవం గడించిన ప్రతాప్ హరిదాస్‌తో గెస్ట్‌కాలం...
మారుతున్న అవసరాలకు అనుగుణంగా
ప్రపంచవ్యాప్తంగా టీచింగ్, లెర్నింగ్ విధానాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో వినూత్న మార్పులు ఎన్నో! ఆన్‌లైన్ కోర్సులు, మూక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతుండడం వల్ల విద్యార్థులకు ప్రపంచ శ్రేణి యూనివర్సిటీల్లోని ఫ్యాకల్టీ లెక్చర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మన దేశంలోనూ ఇలాంటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీటీఈఎల్‌ను రూపొందించింది. ఆన్‌లైన్ విధానంలో ఇప్పటివరకు 860 కోర్సులను నిర్వహిస్తోంది. వీటిలో ఆన్‌లైన్ లెక్చర్స్, వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సులో కనిష్టంగా 20, గరిష్టంగా 30 లెక్చర్స్‌ను వినే అవకాశముంది.
అందుబాటులో ప్రముఖ ఫ్యాకల్టీల లెక్చర్లు
ఎన్‌పీటీఈఎల్‌ను ఐఐటీ, ఐఐఎస్‌సీ వంటి జాతీయ స్థాయిలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఫ్యాకల్టీతోపాటు, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్స్‌లోని ఫ్యాకల్టీ సభ్యుల లెక్చర్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ కొరత సమస్యగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎన్‌పీటీఈఎల్ కోర్సులు మరింత ఉపయుక్తం. ఎన్‌పీటీఈఎల్‌లో నిర్ణీత వ్యవధిలోని కోర్సు పూర్తి చేసుకున్నాక నిర్దిష్ట పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్లు కూడా అందుకోవచ్చు. ఈ సర్టిఫికెట్లకు పరిశ్రమ వర్గాల నుంచి కూడా గుర్తింపు లభిస్తోంది.
అవగాహన కల్పించాలి
ఎన్‌పీటీఈఎల్ కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అవగాహన పెరగాల్సి ఉంది. అందుకోసం సదరు కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లలోని ఫ్యాకల్టీలు తోడ్పడాలి. ఆన్‌లైన్ లెక్చర్స్ ప్రాముఖ్యతను, మన దేశంలో దీనికి ముఖ్య వేదికగా ఉన్న ఎన్‌పీటీఈఎల్ కోర్సుల గురించి తెలియజేయాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ రంగాల్లో ఆన్‌లైన్ లెక్చర్స్ ఎంతో ఉపయోగకరం. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంశాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అలాగే వీటి నాణ్యత గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లెక్చర్స్‌లోని అవసరమైన అంశాల్లో వర్చువల్ ల్యాబ్స్ వీడియో లెక్చర్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక విద్యార్థికి రియల్ క్లాస్ రూంలో ఉన్న భావన కలిగే విధంగా ఇవి ఉంటాయి.
ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు
ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ కోర్సుల విషయంలో కార్పొరేట్ సంస్థల నుంచి సైతం మద్దతు లభించడం ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్‌వేర్ రంగ సంస్థల ప్రోత్సాహం ప్రశంసించదగ్గది. ఈ రంగంలోని నిపుణులు ఆన్‌లైన్ లెక్చర్స్ అందివ్వడానికి సంప్రదిస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల్లోని వివిధ విభాగాల హెడ్స్ ఆన్‌లైన్ లెక్చర్స్ బోధించారు. దీనివల్ల విద్యార్థులకు ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే నైపుణ్యాలు లభిస్తున్నాయి. ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ లెక్చర్స్ విద్యార్థులకు అందించే విషయంలో ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చొరవ చూపాలి. ఈ మేరకు తమ కళాశాలల్లో ఐసీటీ బోధన పద్ధతులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థులు అభ్యసించుకునే వీలు కల్పించాలి.
అందిపుచ్చుకుంటే.. అలవడుతుంది నైపుణ్యం
ఆన్‌లైన్ లెక్చర్స్ విధానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆన్‌లైన్ లెక్చర్స్‌ను వినడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వాటి వల్ల పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. కరిక్యులంలో మార్పులు కోరుకునే విద్యార్థులు అంత వరకు వేచి చూడకుండా వీటిని వినియోగించుకోవడం ద్వారా సమస్య పరిష్కారమవడంతోపాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ప్రాక్టికాలిటీపై అవగాహన ఏర్పడి పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవసరమైన అంశాలు తెలుస్తాయి.

Published date : 02 Oct 2015 05:05PM