`కార్పొరేట్` నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి
Sakshi Education
‘నేటి యువతకు వారి అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో కెరీర్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ రంగం కోరుకునే నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే అవకాశాలు మెరుగవుతాయి’ అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)- గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి సూచిస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తిచేసి, నేషనల్ ఎక్స్‌పర్ట్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు సొంతం చేసుకున్న ఎస్.రఘుపతితో ఈ వారం గెస్ట్ కాలమ్...
ఆధునిక యుగంలో యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవగాహన స్థాయి, అన్వేషించే దృక్పథంలో మార్పు ద్వారా కొందరే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. యువత తమ అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా, కెరీర్స్ గురించి అన్వేషించడం ద్వారా డిగ్రీ ఏదైనా అవకాశాలు ఖాయం.
కొత్తగా కదలాలి
యువత కెరీర్ అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో వినూత్నంగా వ్యవహరించాలి. కేవలం తమ కోర్సులు, అందులో బోధించే అంశాలకే పరిమితం కాకూడదు. ఆ కోర్సులకు అనుబంధంగా ఆవిష్కృతమవుతున్న కొత్త కోర్సుల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ రంగంలో వినూత్న పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ పరిధి విస్తృతమవుతోంది. పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సంస్థల స్థాయిలో ‘గ్రీన్ బిల్డింగ్’ కాన్సెప్ట్‌కు ప్రాధాన్యమిస్తూ, నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలాంటి కొత్త అంశాలపై తర్ఫీదు పొందాలి. ఇలా.. ప్రతి కోర్సులోనూ కొన్ని ప్రత్యేకతలు, కొత్తదనం వెలుగులోకి వస్తోంది. వాటికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి.
నైపుణ్యాలపై అవగాహన పెరగాలి
విద్యార్థుల్లో ఉపాధికి సంబంధించిన నైపుణ్యాలు 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటున్నాయని, కొన్ని కోర్సుల్లో 20 శాతంలోపే ఉంటున్నాయనే నివేదికలు వాస్తవం. వీటిని ఆయా సంస్థలను సంప్రదించి రూపొందిస్తాం. అయితే ఇటీవలకాలంలో పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలపై అవగాహన పెరుగుతోంది. కాలేజ్, ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి నుంచే నైపుణ్యాల పెంపునకు కృషిచేయాలి.
‘సుస్థిరత’కు ప్రాధాన్యం
ఇటీవలకాలంలో సుస్థిరత, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ సంబంధిత విభాగాల్లో దీని ప్రాముఖ్యం అధికంగా కనిపిస్తోంది. ఇంధన వనరుల లభ్యతలో ఉన్న పరిమితుల కారణంగా పునరుత్పాదక శక్తిపై దృష్టి పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ స్థాయిలో విధానాలు అమలవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (సోలార్ పవర్, విండ్ పవర్ తదితర), స్థిరత్వం దిశగా కృషి జరుగుతోంది. ఒక విధంగా సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది కెరీర్ పరంగా కలిసొచ్చే అంశంగా పేర్కొనొచ్చు. వాళ్లు తమ కోర్ సబ్జెక్ట్‌లతోపాటు పునరుత్పాదక వనరులు, వాటి నిర్వహణ మెళకువలు నేర్చుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
కెమికల్‌పై అవగాహన పెరగాలి
కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్‌పై అవగాహన పెరగాలి. వాస్తవానికి రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు కెమికల్ ఇంజనీరింగ్ ఔత్సాహికుల సంఖ్య బాగానే ఉండేది. కానీ ఐటీ విప్లవం నేపథ్యంలో అభ్యర్థులు సంబంధిత కోర్సుల అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ప్యూర్ సైన్స్, కోర్ ఇంజనీరింగ్‌లకు క్రేజ్ తగ్గిందని భావించడం సరికాదు. ఇప్పటికీ, ప్యూర్ సైన్స్, అప్లయిడ్ సైన్స్ విద్యార్థులకు కెరీర్ అవకాశాలు అధికంగానే ఉన్నాయి.
వ్యక్తిగత లక్ష్యాల సాధన
ఏ నేపథ్యమైనా ఇప్పుడు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తూ ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వం.. రెండు రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఖాయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలను, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసుకుంటూ అన్వేషణ సాగిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇందుకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఒక ఉదాహరణ. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఔత్సాహికులకే కాకుండా, ఉత్పత్తి రంగంలో విస్తృత అవకాశాలు కల్పించడానికి మార్గం వేయనుంది. ఇలాంటి వాటిపై దృష్టి పెడితే సుస్థిర భవిష్యత్తు ఖాయం.

Published date : 08 Jan 2016 12:05PM