అవసరాలకు అనుగుణంగా.. ఇగ్నో కోర్సులు!
Sakshi Education
ఆర్థికపరిస్థితుల వల్లనో, మరే ఇతర కారణాలతోనే చదువుకు దూరమైన వారిని పట్టభద్రులను చేయటంలో ఓపెన్ యూనివర్శిటీలది ప్రధాన భూమిక. ఓ వైపు కొలువు కొనసాగిస్తూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసేందుకు అనువైన మార్గం.. దూర విద్య! ముఖ్యంగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(ఇగ్నో) ఈ విషయంలో విద్యార్థులకు మరింతగా చేరువవుతోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాం.. దూరవిద్యతో కెరీర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.. అంటున్న ఇగ్నో రీజనల్ డెరైక్టర్ డాక్టర్ కామేశ్వరిమూర్తితో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ..
విజ్ఞాన వారధులు:
మధ్యలోనే చదువుకు దూరమైన వారికి, రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం లేని వారికి.. ఓపెన్ యూనివర్శిటీలు వాస్తవంగా వరం లాంటివే! దూరవిద్యను కేవలం డిగ్రీ కోర్సులకే పరిమితం చేయకుండా.. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగినట్లుగా కొత్త కోర్సులకు రూపకల్పన చేయటం శుభ పరిణామం. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యార్థులపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే కెరీర్‌లో స్థిరపడేందుకు ఉపయోగపడే కోర్సులనే వాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా ఇగ్నో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది.
మరో అడుగు ముందుకు:
ఇగ్నో ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30లక్షల మంది ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా దాదాపు 400 కోర్సులను అందిస్తోంది. గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, పీహెచ్‌డీ తదితర విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా పదివేల మంది పలురకాల కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్లస్‌టూ ఉన్న వారికే ఇప్పటివరకూ ఇగ్నో ద్వారా దూర విద్య డిగ్రీ చేసే వీలుంది. దీన్ని సవరించి ఎలాంటి విద్యార్హతలు, సర్టిఫికెట్లు అవసరం లేకుండానే.. గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు చేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి నేరుగా డిగ్రీ చదివే వీలు కల్పిస్తున్నాం. ఇంగ్లిష్ మాధ్యమానికే పరిమితమైన డిగ్రీ కోర్సులను రాబోయే రోజుల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నాం. ప్రతిఏటా జనవరి-జూలై నెలల్లో ఇగ్నో నోటిఫికేషన్స్ విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తుంది.
మార్పులకు అనుగుణంగా:
మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దూరవిద్య ద్వారా అందించే కోర్సుల్లోనూ గణనీయమైన మార్పు లు చోటుచేసుకుంటున్నాయి. మూస ధోరణిలో కోర్సులు పూర్తిచేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అలాంటి పరిస్థితులపై అవగాహన కలిగేలా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందించనున్నాం. గ్రామీణ ప్రాంతాలకు తగినట్లుగా వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీఫార్మింగ్, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ వంటి సర్టిఫికెట్ కోర్సులు ఉపాధి బాటలో ఉపయోగపడేవే. శాంతిభద్రతల విభాగంలో పనిచేసే వారికి వృత్తిపరమైన అంశాల్లో మరింత అవగాహన కల్పించేలా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ రైట్స్ తదితర విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సు చేయొచ్చు.
ఆ కోర్సులకు మంచి క్రేజ్:
ఎంబీఏ, ఎంఏ సైకాలజీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. వృత్తిపరమైన నైపుణ్యతకు తగినట్లుగా కెరీర్‌లో ఎదిగేందుకు ఉపయోగపడే కోర్సుల పట్ల ఉద్యోగులు సుముఖత చూపుతున్నారు. బీఈడీ, ఎంఈడీతోపాటు క్లినికల్ కార్డియాలజీ సర్టిఫికెట్ కోర్సు పట్ల వైద్యుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
భిన్నమైన కోర్సులు:
సేవారంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆయా అవసరాలకు అనుగుణంగా నైపుణ్యత సాధించలేకపోతే అది లోపమే అవుతుంది. దాన్ని అధిగమించేందుకు ఆయా అంశాల్లో నైపుణ్యం, అర్హతలను కల్పించే కోర్సుల రూపకల్పన జరిగింది. అయితే, వీటి గురించి విద్యార్థుల్లో సరైన అవగాహన లేకపోవటం వల్ల వారికి పూర్తిస్థాయిలో చేరువకాలేకపోతున్నాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనగానే కేవలం ఎంబీఏ, ఎంసీఏ కోణంలో చూడటం సరికాదు. ఉద్యోగం లభించకపోయినా.. స్వయం ఉపాధికి ఉపయోగపడే డిగ్రీలతోపాటు, స్వల్పకాలిక కోర్సులు అనేకం ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సోషల్‌వర్క్, పీజీ డిప్లొమా కోర్సుల్లో టూరిజం స్టడీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఆక్వాకల్చర్, పారాలీగల్, హోంసైన్స్ కోర్సులు ఉన్నాయి.
నాణ్యత.. నైపుణ్యతే కీలకం:
దూరవిద్య ద్వారా అందించే కోర్సుల్లో నాణ్యత తగ్గుతుందనే వాదన సరైనంది కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అవసరాలను బేరీజు వేసుకుంటూ కోర్సులు, సిలబస్‌ను మెరుగుపరుస్తూనే ఉన్నాం. ఇగ్నో మెటీరియల్‌ను సివిల్స్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులూ అడుగుతున్నారంటే.. మెటీరియల్ స్థాయి అర్ధం చేసుకోవచ్చు. సబ్జెక్టుపై పట్టు, అక్కడి అవసరాలకు తగినట్లుగా దాన్ని సద్వినియోగం చేసుకునే వారి కెరీర్‌లో ఇదెంతో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్నికల్ విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయసాధనలో ఉపయోగపడుతుంది.
సీఏ విద్యార్థులకు ప్రత్యేకం:
సీఏ చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఇగ్నో బీకామ్(అకౌంటెన్సీ, ఫైనాన్స్), ఎంకామ్(ఫైనాన్స్, టాక్సేషన్) కోర్సులు అందిస్తోంది. ఎంబీఏ చదవాలంటే డిగ్రీ తప్పనిసరి. అయితే, మూడేళ్లు సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు అర్హత చూపితే దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయొచ్చు.
అన్నిచోట్లా అలా జరగదు:
కేవలం డిగ్రీ అర్హత కోసమే చేరి ఉత్తీర్ణత కోసం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న సంఘటనలు కొన్నిచోట్ల జరుగుతుండొచ్చు. కాని ప్రతిచోటా అదే విధంగా ఉండదు. ఇగ్నో తరగతుల నిర్వహణ, ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. పరీక్షల సమయంలో అబ్జర్వర్లను నియమించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఆ సమయంలో కాపీయింగ్ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే ఆ కాలేజీ నుంచి స్టడీసెంటర్‌ను రద్దుచేస్తాం. కాపీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.
గుడ్డిగా న మ్మి మోసపోవద్దు:
ఒకే సంవత్సరం డిగ్రీ, పీజీ పూర్తిచేయిస్తామంటూ ఓపెన్ యూనివర్సిటీల పేరుతో వచ్చే ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెబ్‌సైట్‌ను చూడాలి. ఇందులో దూరవిద్య కోర్సులు నిర్వహించడానికి ఏయే యూనివర్సిటీలకు అనుమతి ఉందో తెలిపే వివరాలుంటాయి. కోర్సులు పూర్తిచేయాలంటే ఆయా విశ్వవిద్యాలయాల నిబంధనలకు అనుగుణంగా నియమావళి ఉంటుందనేది గుర్తుంచుకోండి.

Published date : 09 Aug 2013 03:10PM