ఆన్‌లైన్ కోర్సులదే హవా..
Sakshi Education
‘ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే.. భవిష్యత్తులో ఆన్‌లైన్ కోర్సుల హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
విద్యార్థులకు తరగతి గదిలో నేర్పని ఎన్నో విషయాలు ఆన్‌లైన్ కోర్సుల ద్వారా నేర్చుకునే వీలుంది. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సరికొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు.. స్వయం ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన ఎన్‌పీటీఈఎల్ నేషనల్ మూక్స్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ఐఐటీ-చెన్నై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ, జార్జియా టెక్ లొరైన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్ట్ డాక్టోరల్ అందుకున్న ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్‌తో గెస్ట్ కాలమ్...
నైపుణ్యాల సాధనకు వారధి :
విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలు అందుకునేందుకు చక్కటి మార్గం.. ఎన్‌పీటీఈఎల్(నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్). ఇందులో వందల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయా విభాగాల్లో తాజా పరిణామాలతో కూడిన లెక్చర్స్ వినే సదుపాయం ఉంది. విద్యార్థులు వీటి ద్వారా మెరుగైన నైపుణ్యాలు, సరికొత్త స్కిల్స్ సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ కోర్సుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్‌పీటీఈఎల్, స్వయం ఆన్‌లైన్ కోర్సులకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు వీటిల్లో తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం.
మూక్స్‌తో అవగాహన :
మూక్స్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనలు, పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. తాము ప్రస్తుతం చదువుతున్న కోర్సులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో కూడా తెలుస్తుంది. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఇన్‌స్టిట్యూట్స్ ప్రొఫెసర్ల లెక్చర్స్ వినడమే కాకుండా.. రియల్ కేస్ స్టడీస్‌ను కూడా వర్చువల్ లెక్చర్స్ రూపంలో నేర్చుకునే అవకాశం మూక్స్‌తోనే సాధ్యమవుతుంది. యువత, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
కోర్సు పై శ్రద్ధ పెట్టడంలేదు :
ఎన్‌పీటీఈఎల్, మూక్స్ ద్వారా అందుబాటులో ఉన్న పలు కోర్సులకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు 40శాతం మంది రిజిస్ట్రేషన్‌కే పరిమితమవుతున్నారు. కోర్సు పూర్తిచేయడంపై శ్రద్ధ పెట్టడంలేదు. ఒక కోర్సుకు నమోదు చేసుకున్న తర్వాత.. దానికి సంబంధించిన షెడ్యూల్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. దానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలో సదరు లెక్చర్స్ వినాలి. కోర్సు పూర్తయ్యాక నిర్వహించే పరీక్షకు హాజరుకావడం వల్ల క్రెడిట్స్ లభిస్తాయి. తాజాగా ఏఐసీటీఈ.. స్వయం కోర్సుల ద్వారా పొందిన క్రెడిట్స్‌ను డిగ్రీ కోర్సుల్లో పరిగణనలోకి తీసుకోవాలని యూనివర్సిటీలకు సూచించింది. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కోర్సు పూర్తిచేసుకునేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.
ఇండస్ట్రీ కొలాబరేషన్ :
ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ కోర్సుల విషయంలో ఇండస్ట్రీ కొలాబరేషన్ దిశగానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్‌పీటీఈఎల్, మూక్స్ ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ లభించేలా ఇప్పటికే ఐఐటీ-చెన్నై పరిధిలో ఏర్పాటు చేశాం. త్వరలో ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎన్‌పీటీఈఎల్ కోర్సులకు నేటికీ నగర ప్రాంతాల విద్యార్థులే అధికంగా నమోదు చేసుకుంటున్నారు. వీటిని ద్వితీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా విస్తరించాల్సిన అవసరముంది. అందుకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల యాజమాన్యాలు కూడా చొరవ చూపాలి.
దూరవిద్యతో పోల్చొద్దు :
ఆన్‌లైన్ కోర్సులను దూరవిద్య(డిస్టెన్స్ ఎడ్యుకేషన్) విధానంతో పోల్చడం సరికాదు. రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. దూర విద్య విధానంలో కేవలం నిర్దిష్ట రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. కానీ మూక్స్ విషయంలో నిరంతరం లెక్చర్స్ విధానం అమలవుతోంది. ప్రీలోడెడ్ లెక్చర్స్ సైతం అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
రియల్ టైం నాలెడ్జ్ :
ప్రస్తుతం ఆయా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు, త్వరలో కొత్తగా కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే... కేవలం క్లాస్ రూం లెక్చర్స్‌కే పరిమితం కాకుండా.. కొత్త నైపుణ్యాలపై అవగాహన కల్పించే మూక్స్‌పై మొదటిరోజు నుంచే దృష్టిపెట్టాలి. ఫలితంగా మార్కెట్లో పరిణామాలు ఎలా మారినా.. సబ్జెక్ట్, స్కిల్స్ పరంగా వాటిని ఎదుర్కొనే సన్నద్ధత లభిస్తుంది!!

Published date : 27 Mar 2018 05:14PM