TS LAWCET 2022: ఈ బ్రాంచీల నుంచి న్యాయవాద వృత్తిలోకి.. టాపర్స్ వీళ్లే...
బాలురు 77.33%, బాలికలు 69.67% అర్హత పొందారు. ట్రాన్స్‌జెండర్స్ ఈసారి మూడేళ్ల లాసెట్‌లో ఒకరు, ఐదేళ్ల సెట్‌లో ఒకరు అర్హత పొందారు. మొత్తంగా మూడేళ్ల లాసెట్‌లో 74.76%, ఐదేళ్ల లాసెట్‌లో 68.57%, పీజీ లాసెట్‌లో 91.10% క్వాలిఫై అయ్యారు. జూలై 21, 22 తేదీల్లో లాసెట్ జరిగింది. వాటి ఫలితాలను Telangana Council of Higher Education చైర్మన్ ఆర్.లింబాద్రి ఆగస్టు 17న హైదరాబాద్‌లో విడుదల చేశారు. మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్, ఉస్మానియా వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లా కాలే జీల్లో ప్రవేశానికి Bar Council of India అనుమతి తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. లాసెట్‌కు 35,538 మంది రిజిస్టర్ చేసుకుంటే, 28,921 మంది పరీక్ష రాశారని, వీరిలో 21,662 మంది అర్హత సాధించారని ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు.
▶ TS LAWCET/PGLCET 2022 Results - Click Here
చదవండి: కెరీర్‌కు వారధిని నిర్మించుకోండిలా...
లాసెట్ అర్హత ఇలా..
లాసెట్ |
పరీక్షకు హాజరైన వారు |
అర్హత పొందిన వారు |
శాతం |
3 ఏళ్ల లా |
20,107 |
15,031 |
74.76 |
ఐదేళ్ల లా |
6,207 |
4,256 |
68.57 |
రెండేళ్ల పీజీ లా |
2,607 |
2,375 |
91.10 |
మొత్తం |
28,921 |
21,662 |
74.90 |
చదవండి: ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ
మీడియం వారీగా..
మీడియం |
హాజరైనవారు |
అర్హులు |
శాతం |
ఇంగ్లిష్ |
19,166 |
14,327 |
74.75 |
తెలుగు |
9,636 |
7,292 |
75.67 |
ఉర్దూ |
119 |
43 |
36.13 |
చదవండి: ఆలిండియా బార్ ఎగ్జామినేషన్
విద్యార్హత నేపథ్యం వారీగా...
బ్రాంచ్ |
హాజరు |
అర్హులు |
బీఏ |
4,396 |
3,282 |
బీకాం |
6,757 |
4,627 |
బీఎస్సీ |
4,798 |
3,714 |
బీటెక్ |
3,271 |
2,733 |
ఎంబీబీఎస్ |
38 |
34 |
ఫామ్ డి |
15 |
13 |
బి ఫార్మసీ |
291 |
234 |
బీబీఏ |
248 |
170 |
బీసీఏ |
122 |
102 |
బీడీఎస్ |
29 |
25 |
చదవండి: నయా కెరీర్...సైబర్ లాయర్
టాపర్స్ వీళ్లే...
మూడేళ్ల లా
- మద్దిపట్ల సాయికృష్ణ, రాయచోటి, ఏపీ
- శ్రీరామ్ బొడ్డు, పశ్చిమగోదావరి, ఏపీ
- హర్ష యశష్కర్, హైదరాబాద్
- కొట్టె వెంకటేశ్వర్లు, నల్లగొండ
- లావుద్య పీకే చౌహాన్, వరంగల్
ఐదేళ్ల లా...
- కె.సాయి చరణ్ యాజ్వీ, హైదరాబాద్
- అంబటి స్మరణ్, రంగారెడ్డి
- అలుగుబెల్లి హిమదేశ్, హైదరాబాద్
- మహ్మద్ సల్మాన్ సిద్ధిఖీ, కరీంనగర్
- తన్వితారెడ్డి కడసాని, హైదరాబాద్
పీజీ లా..
- మందాల భరత్ భూషణ్, హైదరాబాద్
- కృష్ణారావు అలపర్తి, హైదరాబాద్
- గడ్డం మేఘన, మంచిర్యాల
- చింతల దివ్యవాణి, హైదరాబాద్
- వసంత భరణి, హైదరాబాద్