Skip to main content

LAWCET: రెండవ దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. సీట్ల కేటాయింపు తేదీలు..

తెలంగాణ రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన రెండవ దశ అడ్మిషన్ల ప్రక్రియ జ‌న‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు 12 వరకు అవకాశం కల్పించారు.
LAWCET
రెండవ దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల..

లాసెట్‌లో అర్హులైన అభ్యర్థులు జ‌న‌వ‌రి 7 నుంచి 9వ తేదీ వరకు కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అడ్మిషన్ల కన్వీనర్‌ పి.రమేష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 17న సీట్ల కేటాయిస్తారు. వివరాలకు ‘https://lawcetadm.tsche.ac.in’ను సందర్శించాలన్నారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా

రిజిస్ట్రేషన్

జ‌న‌వ‌రి 7 నుంచి 9 వరకు

ధ్రువపత్రాల పరిశీలన

జ‌న‌వ‌రి 10

వెబ్‌ ఆప్షన్ల నమోదు

జ‌న‌వ‌రి 10 నుంచి 11 వరకు

వెబ్‌ ఆప్షన్ల సవరణ

జ‌న‌వ‌రి 12

సీట్ల కేటాయింపు

జ‌న‌వ‌రి 17

సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టు

జ‌న‌వ‌రి 18 నుంచి 20 వరకు

చదవండి:

53 ఏళ్ల వయసులో మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ

Success: ఆమె కలకు వైకల్యం అడ్డు రాలేదు.. సైలెంట్ లాయర్

AIBE-2021: ఇలా సిద్ధమవ్వాలి!!

Published date : 06 Jan 2022 04:54PM

Photo Stories