LAWCET 2022: షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
మూడు, ఐదేళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూల్‌ను తేలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఏప్రిల్ 1న ప్రకటించారు.
ఏప్రిల్ 6 నుంచి ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు పంపవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, మిగతావారికి రూ.800గా నిర్ణయించారు. పీజీ లాసెట్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800, మిగతావారికి రూ.1,000 ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్
భవితకు వారధి నిర్మించుకోండి ‘‘లా’’
లాసెట్ షెడ్యూల్ ఇలా
దరఖాస్తుల స్వీకరణ మొదలు |
6–4–22 |
దరఖాస్తులకు చివరి తేదీ |
6–6–22 |
జరిమానాతో ఆఖరి తేదీ |
12–7–22 |
తప్పుల సవరణ |
5 నుంచి 12–7–22 |
హాల్ టికెట్ల డౌన్ లోడ్ |
15–7–22 |
మూడేళ్ల లాసెట్ పరీక్ష |
21–7–22 |
ఐదేళ్ల లాసెట్ పరీక్ష |
22–7–22 |
పీజీ లాసెట్ పరీక్ష |
22–7–22 |
Published date : 02 Apr 2022 03:57PM