Skip to main content

LAWCET 2022: దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌ దరఖాస్తుల గడువును జూన్‌ 16 వరకూ పొడిగించినట్టు తెలంగాణ లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి తెలిపారు.
LAWCET 2022
లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

వాస్తవానికి జూన్‌ 6తో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవలసి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్‌ పరీక్ష జూలై 21, 22 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటి వరకూ లాసెట్‌ కోసం మొత్తం 24 వేల దరఖాస్తులు అందినట్టు జీబీ రెడ్డి తెలిపారు. మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో 3597 సీట్లు, 5 ఏళ్ల కోర్సులో 1484, ఎల్‌ఎల్‌ఎంలో 674 సీట్లు ఉన్నాయి.

చదవండి: 

Published date : 08 Jun 2022 04:26PM

Photo Stories