Skip to main content

కోడింగ్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వర్చువల్‌ శిక్షణతోపాటు.. ఉద్యోగాలు కూడా..

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోడింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ విభాగంలో 45 రోజుల వర్చువల్‌ శిక్షణా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (అపితా) సోమవారం ప్రారంభించింది.
ఈ శిక్షణను ‘కోడెన్‌సెట్‌’ సంస్థతో కలిసి అందిస్తున్నట్లు అపితా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 90 శాతం హాజరుతో ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అపితా అకడమిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ బి.మోతీలాల్‌ నాయక్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 15 Jun 2021 02:33PM

Photo Stories