Skip to main content

Employment: ఉపాధి కోసం ముందుకు వస్తున్న మహిళలు.. కోటి మందికి పైగా దరఖాస్తు.. ఎక్క‌డంటే..

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మరింత మంది మహిళలు ఉపాధి కోసం ముందుకు వస్తున్నారు.
Positive Job Trends for Women in 2023   Rising Job Applications from Second and Third Tier CitiesIndia Witnesses 13% Rise In Job Applications From Women In Tier-2, 3 Cities In 2023

2023లో 13 శాతం అధికంగా సుమారు కోటి మంది మహిళలు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు జాబ్స్, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ ఆప్నా డాట్‌ కో (apna.co) నివేదిక వెల్లడించింది. 2022లో ఇవే పట్టణాల నుంచి మొత్తం 2.7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 87 లక్షలుగా ఉన్నాయి.

ప్రతి నిమిషానికి 100 దరఖాస్తులు..
మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చిన ఉద్యోగ దరఖాస్తులు 3.2 కోట్లుగా ఉన్నాయి. ప్రతి నిమిషానికి మహిళల నుంచి 100 ఉద్యోగ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 80 శాతానికి పైగా కార్యాలయ విధులకు సంబంధించినవే ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేయడానికి బదులు, కార్యాలయం నుంచి పని చేయడం, కెరీర్‌ వృద్ధి కోసం మహిళలు చూస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆప్నా నివేదిక తెలిపింది.

2022, 2023 సంవత్సరాల్లో తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్‌ పోస్టింగ్‌లు, దరఖాస్తుల ఆధారంగా ఆప్నా ఈ వివరాలను విడుదల చేసింది. సేల్స్‌ సపోర్ట్, ఎంటర్‌ప్రైజ్‌ సేల్స్, అడ్వర్టైజింగ్, రియల్‌ ఎస్టేట్, ఇన్‌సైడ్‌సేల్స్, బ్రాండ్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ తదితర విభాగాల్లో నిర్వహణ విధులకు సంబంధించి పోస్టింగ్‌లు పది రెట్లు పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం జాబ్‌ పోస్టింగ్‌లు ఫ్రెషర్లకు సంబంధించినవే ఉన్నట్టు ఆప్నా నివేదిక తెలిపింది.

RRB ALP Recruitment: రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులు వీరే..

Published date : 23 Jan 2024 08:28AM

Photo Stories