Skip to main content

TSSC Mission: మానవ వనరుల కొరత తగ్గించాలని లక్ష్యం.. 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..

టెలికం రంగంలో మానవ వనరుల కొరత తగ్గించాలన్న లక్ష్యంతో టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మంది అభ్యర్థులకు టెలికం, సంబంధిత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని యోచిస్తోంది.
Job Opportunities in Telecom and Emerging Technologies  TSSC's Telecom Training Vision  Training and Jobs in Telecom  TSSC Empowering 1.5 Lac in Telecom Careers FY24 Goal    TSSC Aims to Train 1.5 Lakh Candidates

సాంకేతిక రంగం ముఖ్యంగా 5జీ ప్రారంభంతో టెలికం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని, తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్‌ని కలిగి ఉంది. టెలికంలో పెరుగుతున్న ఈ డిమాండ్‌ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికం, సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీఎస్‌ఎస్‌సీ సీఈవో అరవింద్‌ బాలి తెలిపారు.

భారత్‌లో మూడవ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహంలో దాదాపు 6.5 శాతం వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5జీ చందాదార్లలో భారత్‌ 11 శాతం వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్ధేశించిన టెక్కోజాబ్స్‌ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు, 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Layoffs In 2023: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఊచకోత.. కొన్ని లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఇవే.. కార‌ణం ఏమిటంటే..!

Published date : 30 Dec 2023 12:50PM

Photo Stories