Village / Ward Employees: పెరిగిన వేతనాలు.. ఆనందంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు
చీరాల: ప్రభుత్వం తొలి ఇంక్రిమెంట్, డీఏ పెంచింది. పెరిగిన జీతాలు అందుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. శాశ్వత ఉద్యోగులుగా మారి ఏడాది పూర్తయిన వారికి ఏ మాత్రం జాప్యం లేకుండా ఇంక్రిమెంట్, డీఏ కలిపి జూలై నెల జీతాన్ని ఆగస్టులో అందించింది. తొలి ఇంక్రిమెంట్, డీఏ పెంపుతో జీతం పెరుగుదల కనిపించడంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల్లో ఉద్యోగం చేపట్టిన తర్వాత ప్రొబేషన్ సకాలం పూర్తి చేయడం, శాశ్వత ఉద్యోగులుగా చేయడంతో పాటు ఏడాది పూర్తయిన వెంటనే ఇంక్రిమెంట్, డీఏ పెంచడం సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఉద్యోగులు అంటున్నారు.
ఇవీ చదవండి: చదువుల్లో రారాజులు... చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తల విద్యార్హతలు ఇవే..!
బాపట్ల జిల్లాలో మొత్తం 477 సచివాలయాలు ఉండగా వీటిలో 4260 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంక్రిమెంట్ రూ.600 చెల్లించింది. డీఏను వార్డు సచివాలయ అడ్మిన్, గ్రామ సచివాలయ కార్యదర్శికి రూ.781 చొప్పున పెంచింది. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ.764 చొప్పున డీఏ పెంచారు. ప్రభుత్వం ఇంక్రిమెంట్‌తో పాటు డీఏ పెంచడంతో సచివాలయ ఉద్యోగులకు కేడర్‌ను బట్టి రూ.1503 నుంచి రూ.1546 వరకు జీతాలు పెరిగాయి. వార్డు అడ్మిన్‌కు రూ.1546, వార్డు సెక్రటరీలకు రూ.1530, గ్రామ సచివాలయ సెక్రటరీలకు రూ.1521, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ.1503 చొప్పున జీతాలు పెరిగాయి.
ఇవీ చదవండి: TS DSC 2023 Notification Date : ఆ తర్వాతే టీఎస్ డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్
జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్లలోపు ఉన్న సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం 16 శాతం మేర హెచ్‌ఆర్‌ఏ అందిస్తోంది. దీంతో జిల్లా కేంద్రానికి సమీపంలో వారికి రూ.950 అదనపు ప్రయోజనం చేకూరుతుంది. మిగిలిన ఉద్యోగులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తోంది. మొదట్లో సచివాలయ ఉద్యోగులందరికి ఒకే రకమైన హెచ్‌ఆర్‌ఏ వర్తించగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నవారికి అదనపు మేలు చేకూరింది.
ఇవీ చదవండి: మరో మూడు రోజుల్లో సూర్యుడి చెంతకు ఆదిత్య... బడ్జెట్ ఎంతంటే..!
ఉద్యోగి పాత స్కేల్ - కొత్త స్కేల్
వార్డు అడ్మిన్ రూ.31,648 - 33,194
గ్రామ సచివాలయ సెక్రటరీ రూ.30,723 - 32,244
వార్డు సచివాలయ ఉద్యోగి రూ.30,749 - 32,279
గ్రామ సచివాలయ ఉద్యోగి రూ.29,851 - 31,354