Cancer: క్యాన్సర్‌పై విద్యార్థులకు అవగాహన అవసరం
బాపట్ల అర్బన్: బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నజీర్ షేక్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో సహాయపడే న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ అభివృద్ధికి కారణమైన ప్రయోగం చేసిన నోబెల్ గ్రహీత మేడం క్యూరీ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ప్రజలలో చైతన్యం తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాపట్ల జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.విజయమ్మ మాట్లాడుతూ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి విద్యార్థులకు వివరించారు. డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనదేశంలో ఏడు రకాల క్యాన్సర్లతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. లంగ్స్, బ్రెస్ట్, నోటి, గర్భాశయ, కడుపు, అన్నవాహి, లివర్ క్యాన్సర్‌తో ఎంతో మంది బాధపడుతున్నారని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్లను నివారించవచ్చన్నారు. దంత వైద్యులు డాక్టర్ శశి కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణ గురించి విద్యార్థులకు వివరించారు. కళాశాల విద్యార్థుల అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ డి. నిరంజన్‌బాబు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి అతి ప్రమాదకరమైనదన్నారు. దీనిపై అపోహలు ఉన్నా వాటిని నివృత్తి చేసేందుకు చేపడుతున్న ప్రభుత్వ, ఎన్జీఓ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. కొందరు ధూమపానం, మద్యపానం, గుట్కా వంటి వ్యసనాలకు అలవాటుపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్స్ కె.రాజేంద్ర, వై.శృతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: Distribution of tabs: దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ