Skip to main content

Reliance Recruitment: రిలయన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ప్రోగ్రామ్.. అర్హ‌త‌లు ఇవే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోని వివిధ విభాగాల్లో చురుకుగా సహకరించడానికి ప్ర‌ముఖ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటుంది.
 Graduate Opportunities at Reliance Industries  Collaborative Opportunities for Engineers at Reliance Industries  Reliance Industries    Reliance Released Notification For The Recruitment Of Graduate Engineer Trainee 2024

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (Graduate Engineer Trainee) 2024లో భాగంగా వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ త‌దిత‌ర వివరాలు ఇవే..  

ఉండాల్సిన అర్హతలు : 
ఏదైనా ఏఐసీటీఈ (AICTE) గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్‌/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్‌ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి. 10వ తరగతి, 12వ తరగతి డిప్లొమా కోర్సుల్లో కనీసం 60% లేదా 6 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సాధించి ఉండాలి.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం : 
ఉద్యోగంలో చేరిన ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.7.50 లక్షలు, 12 నెలలు పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.8.00 లక్షలు ఉంటుంది. అలాగే వార్షిక బోనస్ కింద సంవత్సరానికి రూ.88 వేలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ అయిన తరువాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయితే రూ.3 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఉంటుంది.

ఉద్యోగంలో చేరిన నాన్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగంలో చేరినప్పుడు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.9.00 లక్షలు, సంవ‌త్స‌రం పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద రూ.9.50 లక్షలు ఉంటుంది. వార్షిక బోనస్ కింద సంవత్సరానికి సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయిన తర్వాత రూ.5 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : 11-01-2024 నుంచి 19-01-2024 వరకు.

ఆన్‌లైన్ అసెస్‌మెంట్ : 05-02-2024 నుంచి 08-02-2024 వరకు.

ఇంటర్వ్యూ : 23-02-2024 నుంచి 01-03-2024 వరకు.

తుది ఎంపిక: మార్చి, 2024 చివరి నాటికి పూర్తవుతాయి.

వెబ్‌సైట్‌: https://relianceget2024.in/ 

ECIL Recruitment 2024: ECILలో 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేదు.. ఎంపిక విధానం వివరాలు ఇవే..

Published date : 23 Feb 2024 01:41PM

Photo Stories