Skip to main content

Job Mela: ఈనెల 20న జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

Job Mela  Parvathipuram job fair announcement  District Skill Development Officer U. Saikumar Press conference at Parvathipuram  Government Junior College job fair Job fair details for 20th of this month

పార్వతీపురం టౌన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 20న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 18 నించి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ మహిళలకు నార్మల్‌ డిగ్రీ/పీజీ–డిగ్రీ (కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్‌, మైక్రో బయాలజీ ) చదువుకుని వయస్సు 19 నిండి 25 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

TG CPGET Results 2024: సీపీగెట్‌లో ఏడు సబ్జెక్టుల్లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థిని

అవంతి ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇంటర్వూస్‌ నిర్వహించనుందని, ఈ డ్రైవ్‌కు కంపెనీ ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఎంపిక చేసుకోనున్నారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందని, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు వారి వివరాలను https://skilluniverse.apssdcl.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.

NRIF Rankings : ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకులు.. ఈ విభాగాల్లో..

రిఫరెన్స్‌ నంబర్‌తో పాటు రెస్యూమె, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఒరిజినల్‌, జిరాక్స్‌ సెట్లు, 1 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్‌ జరిగే ప్రదేశంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 6305110947, 9494777553 నంబర్లలో సంప్రదించాలని వివరించారు.
 

Published date : 13 Aug 2024 03:43PM

Photo Stories