Job fair tomorrow: రేపు జాబ్ మేళా
వికారాబాద్ అర్బన్: పట్టణంలోని జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో 13వ తేదీ ఉద యం 10:30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 150 ఉద్యోగాల కోసం అపోలో ఫార్మసీ ప్రైవేట్ కంపెనీ వారు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫార్మ సీ కోర్సులతోపాటు, డిగ్రీ, ఇంటర్, పదో తరగ తి విద్యార్హత ఉన్న వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్‌నంబర్ 96760 47444లో సంప్రదించాలని సూచించారు.
విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
వికారాబాద్ అర్బన్: మహాత్మ జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను బీసీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 30లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖా స్తు చేయాలన్నారు. ఇంజనీరింగ్, వైద్యం, సైన్స్, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్రం(డిగ్రీ)లో 60శాతం మార్కు లు సాధించిన 35 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు రెండు విడతల్లో వారు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజును స్కాలర్ షిప్ రూపంలో మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు
సమ్మె విరమించి విధుల్లో చేరండి అంగన్‌వాడీలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూచన
వికారాబాద్ అర్బన్: నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన విరమించి విధుల్లో చేరాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలిత కుమారి సూచించారు. పట్టణంలో అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి వారితో మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నందున సమ్మె విరమించాలని కోరారు. సిబ్బంది సమస్యలను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొడంగల్ రూరల్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కళాశాలలు, పాఠశాలల్లో అతిథి అధ్యాపకులుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని బీసీ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్‌యాదయ్యగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘికశాస్త్రం, ఆంగ్లం, గణితశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా సమీప బీసీ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.