Job Mela in Vijayawada: 24న ఐటీఐ అభ్యర్థులకు జాబ్‌మేళా
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఐటీఐ పూర్తి చేసిన వారికి వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు జులై 24వ తేదిన విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని తమ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్‌ట్రానిక్స్, రమేష్ ఆసుపత్రి, ఎల్‌వీ ప్రసాద్ హాస్పటల్, హయత్ ప్లేస్‌ల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఐటీఅండ్‌ఎస్‌ఎం, పెయింటర్, వెల్డర్ ట్రేడ్‌ల్లో అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే జాబ్‌మేళాకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
Faculty Jobs: జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు