Skip to main content

August Month Exams: ఆగ‌స్ట్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే...

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష తేదీలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఒకేరోజు రెండు, మూడు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, యూపీఎస్సీలు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల తేదీలు ఇలా ఉన్నాయి.
August Month Exams
ఆగ‌స్ట్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే...

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌.. ఏఓ, జేఏఓ, సీనియ‌ర్ అకౌంటెంట్ ప‌రీక్ష కోసం నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష ఈ నెల 8వ తేదీ జ‌ర‌గ‌నుంది. అలాగే టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌నున్న వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్ రాత ప‌రీక్ష 13వ తేదీ జ‌ర‌గ‌నుంది. 

చ‌ద‌వండి: గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌నున్న గ్రూప్ 2 ప్రాథ‌మిక ప‌రీక్ష 29, 30వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాత ప‌రీక్ష 21, 22వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి.

Exams

ఇక బ్యాంకు ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఐబీపీఎస్ నిర్వ‌హించ‌నున్న స్కేల్ 1 ఆఫీస‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ ప్రాథ‌మిక ప‌రీక్షలు 12, 13, 19వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి.

ఐబీపీఎస్ క్ల‌ర్క్ ప్రిలిమ్స్ ప‌రీక్ష 26, 27, సెప్టెంబ‌ర్ 2వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి.

చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష విధానం ఇదే.. సబ్జెక్ట్‌ల వారిగా ప్ర‌శ్న‌లు ఇవే..

యూపీఎస్సీ నిర్వ‌హించనున్న సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) ప‌రీక్ష 6వ తేదీ జ‌ర‌గ‌నుంది.

కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాల్లోని పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించ‌నున్న ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ెల్ టైర్ 1 ప‌రీక్ష ఈ నెల 2వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 03 Aug 2023 03:56PM

Photo Stories