Skip to main content

AI: ఏఐతో క్ల‌రిక‌ల్ ఉద్యోగుల‌కు నిద్ర‌లేని రాత్రులే..!

రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గత కొంతకాలంగా భయపడుతున్నారు. చాలా మంది నిపుణులు కూడా కృత్రిమ మేధ అనేక సమస్యలను తీసుకువస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Generative AI
ఏఐతో క్ల‌రిక‌ల్ ఉద్యోగుల‌కు నిద్ర‌లేని రాత్రులే..!

అయితే ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే అని ఐక్యరాజ్య సమితికి చెందిన 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' (ILO) కొంత ఉపశమనం కలిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇవీ చ‌ద‌వండి: ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

నిజానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా రోజులు ముందు నుంచి ఉన్నప్పటికీ 'చాట్‌జీపీటీ' ఎంట్రీతో సంచలనంగా మారింది. అనతి కాలంలో చాలా కంపెనీలు దీని సాయంతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేసుకున్నాయి. దీంతో తప్పకుండా ఉద్యోగాలు పోతాయని చాలామంది భయపడ్డారు. రానున్న రోజుల్లో లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

AI

ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐకి సంబంధించి ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తుండంతో ఇది మరింత భయాన్ని కల్పించింది. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది.

ఇవీ చ‌ద‌వండి: జ‌గ‌న‌న్న విద్యాదీవెన నిధులు విడుద‌ల‌... అకౌంట్లలో డబ్బుల వివ‌రాలు ఇలా

ఈ టెక్నాలజీ ఎప్పటికీ ఉద్యోగులను రీప్లేస్ చేసే అవకాశం లేదని వెళ్ళదీస్తూనే.. ఏఐ వల్ల భవిష్యత్ టెక్నాలజీ మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. కావున ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోతామనే అపోహ విడిచిపెట్టాలని తెలిపింది. ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చిన అవన్నీ కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.

Published date : 28 Aug 2023 03:51PM

Photo Stories