Coffee Break In Office: కాఫీ బ్రేక్ కోసం బయటికి వెళ్తున్నారా? ఈ ఆఫీసులో అవన్నీ కుదరవు.. బాస్ కొత్త రూల్స్
ఆఫీసులో పని చేసి అలసిపోయినప్పుడు ఉద్యోగులు మధ్యలో విరామం తీసుకోవడంలో భాగంగా కాఫీ కోసం బయటకు వెళ్తారు. ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ కోసం బయటకు వెళ్ళకూడదు అని ఆస్ట్రేలియన్ మైనింగ్ బాస్ & మినరల్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ 'క్రిస్ ఎల్లిసన్' ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.
ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ తాగాలని బయటకు వెళ్తే, కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ఎల్లిసన్.. రోజంతా ఉద్యోగులను ఆఫీసులోనే ఉంచడానికి కొత్త రూల్ పాస్ చేశారు. ఇందులో భాగంగానే ఆఫీసులోనే ఉద్యోగులకు కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సన్నద్ధమయ్యారు.
ఉద్యోగుల కోసం ఆఫీసులోనే రెస్టారెంట్, జిమ్, స్టాఫ్ సైకాలజిస్ట్‌లు, క్రెచ్ వంటి సౌకర్యాలను ఏపాటు చేయడానికి ఎల్లిసన్ పెట్టుబడి కూడా పెట్టారు. ఇవన్నీ ఆఫీసులోనే ఉంటే ఉద్యోగి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఉద్యోగులు ఓ కప్పు కాఫీ కోసం రోడ్డుపైకి (బయటకు) వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన అన్నారు.
Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా
ఉద్యోగులు బయటకు వెళ్లడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కూడా సరైనది కాదని వెల్లడించారు. కోవిడ్ 19 తరువాత రిమోట్ వర్క్ విధానానికి అనుమతి ఇచ్చిన కంపెనీలను కూడా అయన విమర్శించారు. ఎల్లిసన్ గత ఏడాది వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి మంగళం పాడేసారు.