AF Ecology Centre: బైకు రిపేరీపై నైపుణ్య శిక్షణ
కళ్యాణదుర్గం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బైకు రిపేరీ కోర్సుపై నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజుల పాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి శిక్షణ ఉంటుందని, వివరాలకు 9959422884, 6303580397 నంబర్లను సంప్రదించాలన్నారు.
Rural Development Trust: ప్రతిభకు ప్రోత్సాహం.. అన్నీ ఉచితమే...
అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంటలో సోమవారం ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఉరవకొండకు చెందిన భవాని (13) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఆమె తగరకుంటలో ఉన్న తన మేనత్త లలితమ్మ దగ్గర ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుకొంటోంది. సోమవారం పాఠశాల నుంచి వచ్చిన భవాని అంగడి వద్ద ఉన్న మేనత్త దగ్గరకు వెళ్లి ఇంటి తాళం చెవి ఇప్పించుకొని ఇంటికి వెళ్లింది. తర్వాత లలితమ్మ ఇంటి లోపలికి వెళ్లి చూడగా భవాని ఇంటిలో ఊయలగా వేసిన చీరతో మెడకు చుట్టుకొని వేలాడుతూ కనిపించింది. కనగానపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు భవాని ప్రమాదవశాత్తూ చీర మెడకు చుట్టుకొని మృతి చెందిందా? లేక ఉరేసుకొని చనిపోయిందా? తేలాల్సి ఉంది.