Amazon CEO Andy Jassy's: వర్క్ ఫ్రమ్ హోంకు గుడ్‌బై... ఇష్టం లేకుంటే ఇంటికెళ్లిపోండి!
ఈ తరుణంలో ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఆండీ జెస్సీ పునరుద్ఘాటిస్తూ చెప్పడంతో ఉత్కంఠతకు దారి తీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సిందేనని అన్నారు. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని, సహోద్యోగులతో కలిసి పని చేయాలని భావించగా..మరికొందరు జర్నీ, ఇతర ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
ఇవీ చదవండి: మరో 15 రోజుల వరకే ఫ్రీ... ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!
అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే, మూకుమమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అమెజాన్ కంపెనీలో ఈ అసమ్మతి పర్వం కొనసాగుతుండగా.. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు.
చదవండి: చదువుల్లో రారాజులు... చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తల విద్యార్హతలు ఇవే..!
మరికొందరు కంపెనీ తీసుకున్న నిర్ణయం విషయంలో మరోమారు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందోనని అమెజాన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.