Skip to main content

7 Crore salary for Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో రూ.7 కోట్ల జీతం!

ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ వంటి టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతుండగా.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వాదించే వారూ ఉన్నారు.
7 Crore salary for Artificial Intelligence Experts, amazon, NETFLIX jobs.
7 Crore salary for Artificial Intelligence Experts

ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌, ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చాట్‌జీపీటీ తరహా జనరేటీవ్‌ ఏఐ వంటి టెక్నాలజీలలో నిపుణులైన వారికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. 
నెట్‌ఫ్లిక్స్‌ తన అఫిషియల్‌ వెబ్‌సైట్‌లో ఈ జాబ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో మెషిన్‌లెర్నింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు ఔత్సాహికులైన అభ్యర్ధులు కావాలి.

Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి

డిగ్రీతో పనిలేదు:

అమెరికా కేంద్రంగా కాలిఫోర్నియా కేంద్రంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆఫీస్‌లో పనిచేయాలి. లేదంటే వెస్ట్‌ కోస్ట్‌ ప్రాంతం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయం ఉంది. ప్రారంభ వేతనం ఏడాదికి 3లక్షల డాలర్ల నుంచి 9లక్షల డాలర్ల వరకు ఉంటుంది. డిగ్రీ అవసరం లేదని పేర్కొంది. 

Fresher Jobs in Amazon: ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం మీదే!

జీతంతో పాటు బోనస్‌లూ అదనం:

AI

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలపై జాబ్స్‌ ఉన్నాయంటూ అమెజాన్‌ సైతం ప్రకటన చేసింది. సైన్స్‌ అండ్‌ జనరేటీవ్‌ ఏఐ’లో పని చేసేందుకు సీనియర్‌ మేనేజర్లు కావాలని పిలుపునిచ్చింది. సైంటిఫిక్‌ రిసెర్చ్‌, అప్లికేషన్‌ ఏఐ టెక్నిక్స్‌ బృందాన్ని లీడ్‌ చేసేందుకు టీం లీడర్లు కావాలి. ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగించి మనుషులు ఎలాగైతే ఇమేజెరీ అండ్‌ వీడియోస్‌ తయారు చేస్తారో అలాగే తయారు చేసే స్కిల్స్‌ ఉండాలని సూచించింది. బేస్‌ శాలరీ ఏడాదికి 3లక్షల 40 వేల డాలర్లు, శాలరీతో సంబంధం లేకుండా ప్రత్యేక బోనస్‌ల్ని అందిస్తామని తెలిపింది.

1-crore Salary package: కోటి రూపాయ‌ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఐఐఐటీ అమ్మాయి... కోడింగ్‌పై ప‌ట్టుంటే కోట్లు కొళ్ల‌గొడుతున్న విద్యార్థులు

యూఎస్‌లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో:

చాట్‌జీపీటీ విడుదలతో ఆయా రంగాల్లో ఆర్టిపిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో ఈ విభాగంలో ఎక్స్‌పర్ట్స్‌కు డిమాండ్‌ అధికంగా ఉంది. అందుకు నిదర్శనమే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల నియమాకం. ఈ రెండు సంస్థలు ఏఐ నిపుణులకు చెల్లించే జీతం యునైటెడ్ స్టేట్స్‌ (యూఎస్‌)లో టాప్‌ వన్‌లో సంపాదించే వారి జాబితాలో నిలబెట్టనుంది. ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా శాలరీలను ఆఫర్‌ చేస్తున్నాయి. రిటైల్ మీడియా ఏఐ డైరెక్టర్‌కు వాల్‌మార్ట్ సంవత్సరానికి  288,000 డాలర్ల వరకు ఆఫర్ చేస్తోంది.  ఏఐ సంబంధిత చట్టపరమైన విషయాలలో నైపుణ్యం కలిగిన న్యాయవాదికి సంవత్సరానికి 351,000 లక్షల డాలర్లను చెల్లించడానికి గూగుల్‌ సిద్ధంగా ఉంది.

online dating app

ఆన్‌లైన్ డేటింగ్ యాప్ హింగే వంటి నాన్-టెక్ కంపెనీలు కూడా ఏఐ నిపుణుల్ని ఆహ్వానిస్తున్నాయి. హింజ్ మాతృ సంస్థ, మ్యాచ్ గ్రూప్ ఏఐ వైస్‌ప్రెసిడెంట్‌కు సంవత్సరానికి 398,000 లక్షల డాలర్లను వెచ్చిస్తుంది. ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్ అప్‌వర్క్ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో రిమోట్ వైస్ ప్రెసిడెంట్ విధులు నిర్వహించే వారి కోసం అన్వేషిస్తుంది. 437,000 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీని అందిస్తోంది.

IT Jobs: కోడింగ్ రాక‌పోయిన సాఫ్ట్‌వేర్ జాబ్‌... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ

Published date : 17 Aug 2023 01:45PM

Photo Stories