Skip to main content

JEE Main Result 2022 Session 1: జేఈఈ మెయిన్ మొద‌టి విడ‌త ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్‌ ర్యాంక‌ర్లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : జేఈఈ మెయిన్-2022 మొద‌టి విడ‌త ఫ‌లితాలను విడుద‌ల చేశారు.
JEE Main 2022 Results
JEE Main 2022 Results

ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఫ‌లితాలను చూడొచ్చు . జేఈఈ–మెయిన్‌.. ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు.. ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశంతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్స్‌ కోసం ఉద్దేశించినదే ఈ అర్హత పరీక్ష! జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తొలి సెషన్‌ ఫైనల్‌ కీని National Testing Agency విడుదల చేసింది. ఈ ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు.

జేఈఈ మెయిన్-2022 మొద‌టి విడ‌త ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

JEE Main 2022 Cut Off Marks: మెయిన్‌.. కటాఫ్‌ ఎంతో తెలుసా..?

How to Check JEE Main Result 2022?

  • Visit the official NTA RESULT website - ntaresults.nic.in
  • Click on the Result of JEE (Main) Session 1_Paper 1 is Live Now
  • You will be redirected to a new page.
  • Enter your details application number and date of birth and Click on the “Submit”
  • Your result will be displayed on the screen.
  • Download the result page and save it for future use.

చదవండి: జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...

100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే..

1. JASTI YASHWANTH V V S  ( TELANGANA )
2. SARTHAK MAHESHWARI  ( HARYANA )

3. ANIKET CHATTOPADHYAY ( TELANGANA )

4. DHEERAJ KURUKUNDA ( TELANGANA )

5. KOYYANA SUHAS      (Andhra Pradesh)

6. KUSHAGRA SRIVASTAVA  (JHARKHAND)

7. MRINAL GARG  ( PUNJAB )

8. SNEHA PAREEK  ( ASSAM )

9. NAVYA    ( RAJASTHAN )

10. PENIKALAPATI RAVI KISHORE (Andhra Pradesh)

11. POLISETTY KARTHIKEYA  (Andhra Pradesh)

12. BOYA HAREN SATHVIK   ( KARNATAKA )

13. SAUMITRA GARG   (UTTAR PRADESH)

14. RUPESH BIYANI ( TELANGANA )

ఇక సెకండ్‌ సెషన్‌పైనే ఆశ‌లు..
మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్‌ సెషన్‌ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్‌ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్‌ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్‌ 1వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించిన విష‌యం తెల్సిందే. ఇది ఇలా ఉండగా జేఈఈ సెకండ్‌ సెషన్‌ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్‌ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.

Published date : 11 Jul 2022 01:50PM

Photo Stories