JEE Main 2023 Session-2 Results Link : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు ఎప్పుడంటే..? రిజల్డ్స్‌ను ఈ సారి..
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 29న తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
How to Check JEE Main 2023 session-2 Marks..?
➤☛ Visit the official website ☛ jeemain.nta.nic.in 2023.
➤☛ On the homepage, click on the ‘JEE Mains 2023 session 2 result’ link.
➤☛ Enter the application number, password and security pin.
➤☛ JEE Main 2023 result will be displayed on the screen.
➤☛ Download the JEE Main result session 2 and save a copy for future reference.
ఈ స్కోరుతోనే..
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరిలో జరిగాయి. అలాగే ఏప్రిల్ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు కేటాయించనుంది.
ఫలితాల కోసం 9 లక్షల మంది ఎదురుచూపు..
జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్-1, 2).. వారిలో దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా. ఈ ఫలితాల కోసం 9 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.