Skip to main content

JEE Main 2022 Results : జేఈఈ మెయిన్‌-2 ఫ‌లితాలు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి National Testing Agency (NTA) నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష JEE Mains–2. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ ప్రాథమిక కీ ఆగస్టు 3న విడుదలైంది.
JEE Main 2022
JEE Main 2022 Results

ఎన్‌టీఏ, జేఈఈ వెబ్‌సైట్లలో వీటిని అందుబాటులో ఉంచింది. JEE Mains–2 ఫలితాలు ఆగస్టు రెండో వారంలో వెలువడే అవకాశం ఉంది. JEE Main  అర్హత సాధిస్తే అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు.

How to check JEE Main result 2022 session 2 ?

  • Go to the JEE Main result 2022 NTA official website: jeemain.nta.nic.in 2022

  • Click on JEE Main session 2 result link.

  • Enter the application number and date of birth in the required fields.

  • Check all the details mentioned in the JEE Main scorecard 2022.

  • Download the JEE Main 2022 result for future reference.

ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్‌..
ఇందులో లభించే ర్యాంకు ఆధారంగానే IIT కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే.. JEE Main ర్యాంకు ఆధారంగా NITలు, ఐఐఐటీల్లో Engineering సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్‌ మొదలవుతుంది. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? JEE Advancedకు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్‌లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. JEE Mainsలో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు.

కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా..
ఎన్‌ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్‌ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్‌ డేటా చెబుతోంది.

34,319 సీట్లు.. కానీ భ‌ర్తీ మాత్రం..
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్‌ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు.

Published date : 08 Aug 2022 12:59PM

Photo Stories