సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని, ఈ ఏడాది 67 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.
గురుకుల విద్యార్థుల జయకేతనం
ఈ మేరకు ఆయన జూన్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కాలంలో పరీక్షలు రాయకుండానే 9, 10 తరగతులు ఉత్తీర్ణులైన వారే ప్రస్తుత జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉన్న కటాఫ్ మార్కుల ఆధారంగా చూసినప్పుడు ఈ ఏడాది ఐఐటీల్లో 16, ఎన్‌ఐటీల్లో 39, నిఫ్ట్, ఇతర సెంట్రల్ యూనివర్సిటీల్లో 12 చొప్పున మొత్తం 67 మంది ఎస్సీ గురుకులాల విద్యార్థులకు సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు.