Niper JEE 2023 Rankers: నైపర్ జేఈఈలో సత్తా చాటిన ఓటీపీఆర్‌ఐ విద్యార్థులు
ప్రతిభ చాటిన వారిలో 249వ ర్యాంక్‌తో కె.ప్రత్యూష, 795 ర్యాంక్‌తో జి.శివరంజని, 890 ర్యాంక్‌తో కె.జోషిత తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు. అలాగే జి.లింగేశ్వ (1,600), జి.సుకన్య (2,300), ఎన్.బ్లెస్సీ (2,997), ఎం.శిరీష (3,283), కె.శ్వేతాబాయి (3,647) ర్యాంకులు దక్కించుకున్నారు. దీంతో వీరు మొహాలీ, హైదరాబాద్, గౌహతి, కోల్‌కతా, రాయ్‌బరేలీ, హాజీపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో పీజీ చేయడానికి మార్గం సుగమమైంది.
Postpone All Exams: వానలు తగ్గేదాకా.. పరీక్షలన్నీ వాయిదా!
ఫార్మాసుటిక్స్, ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాసుటికల్ అనాలసిస్, రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ రీసెర్చ్ తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రతిభ చాటిన విద్యార్థులను ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ అభినందించారు.