JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం.. పరీక్ష ఈ విధానంలో..
Sakshi Education
సిద్దిపేట అర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ సెషన్ –2 పరీక్షలు ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి.
తొలిరోజు 68 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష సీబీటీ విధానంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించిన సెషన్‌కు 35కు 34 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించిన సెషన్‌కు 39కి 34 మంది హాజరయ్యారు.
చదవండి: JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు.. టాప్–23లో పది మంది తెలుగు వాళ్లే..
రెండు సెషన్లకు కలిపి ఆరుగురు గైర్హాజరయ్యారు. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ గోపాల్, టీసీఎస్ ఆఫీసర్ కుమార్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ మహ్మద్ షాదుల్లా, డీపీ రావు పర్యవేక్షించారు.
Published date : 05 Apr 2024 02:47PM