JEE Main Admit Card 2023 : జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్టు డౌన్‌లోడ్ చేసుకోండిలా..
మొదట జనవరి 24వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే 25వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రేపు (జనవరి 22వ తేదీన) విడుదల చేయనుంది.
Also Read: JEE (MAINS) - MODEL PAPERS | GUIDANCE | PREVIOUS PAPERS (JEE MAIN) | SYLLABUS | NEWS | VIDEOS
పరీక్ష షెడ్యుల్ ఇలా..
బీఈ, బీటెక్ విభాగాల్లో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష (పేపర్ 1, రెండు షిఫ్టుల్లో) జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, జనవరి 28న బీఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో పేపర్-2ఏ, 2బీ పరీక్ష (మధ్యాహ్నం షిఫ్ట్‌లో) జరుగుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ స్పష్టంచేసింది.
చదవండి: JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
మొదట jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తరువాత హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-1కు సంబంధించి లింక్‌పై క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.