Skip to main content

JEE Main 2022 Session 2 Postponed : జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ప‌రీక్ష వాయిదా.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: IIT, NITల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ JEE Main 2022 Session 2 ప‌రీక్ష వాయిదా ప‌డ్డాయి.
JEE Main 2022 Session 2 Postponed
JEE Main 2022 Session 2 Postponed

రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ వాయిదా ప‌డ్డ JEE Main 2022 Session 2 ప‌రీక్ష‌ జులై 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార‌ణం ఏంటంటే.. CUET Exam 2022 జులై 20 వరకు జరుగనున్నాయి. వెంటనే జులై 21 నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు ప్రారంభమైతే.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జులై 25 నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. JEE Main 2022 Session 2 పరీక్షలకు 6,29,778 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

AP EAMCET 2022 Rank Predictor : మీరు ఏపీ ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? అయితే మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందో తెలుసా..?

జేఈఈ మెయిన్‌ తొలి విడత ర్యాంకులు మాత్రం..

JEE Main Ranks


JEE Main తొలి విడత పరీక్షలు జూన్‌ 30తో ముగిసిన విష‌యం తెల్సిందే.  జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 8.72 లక్షల మంది దరఖాస్తు చేయగా తొలివిడత పరీక్షకు 7.69 లక్షల మంది హాజరయ్యారు. రెండో విడత సెషన్‌ పరీక్షలు ముగిసిన అనంతరం మెయిన్‌లో ర్యాంకులు సాధించిన వారి ఫలితాలను ఆగస్టు 6 లోగా National Testing Agency ప్రకటించనుంది. JEE Advanced పరీక్షకు అడ్మిట్‌ కార్డులను ఆగస్టు 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో IIT Bombay పొందుపరచనుంది. స్క్రయిబ్‌ అవసరమయ్యే అభ్యర్థులు ఆగస్టు 27లోగా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న JEE Advanced పరీక్ష జరుగుతుంది.

TS EAMCET 2022 Rank Predictor : ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందో తెలుసా..?

Published date : 20 Jul 2022 06:41PM

Photo Stories