JEE Advanced బ్రేకింగ్: జేఈఈ అడ్వాన్స్ డ్ గడువు ఒకరోజు పెంపు
Sakshi Education
జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీని ఐఐటీ–ఖరగ్‌పూర్ ఒక రోజు పొడిగించింది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 20 రాత్రి 11:59 గంటలతో దరఖాస్తు గడువు పూర్తికావాల్సి ఉండగా, అభ్యర్థులకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువును పెంచుతూ అవకాశాన్ని కల్పించారు. దీంతో జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్ష కోసం సెప్టెంబర్ 21 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమయంలో పరీక్ష రుసుము రూ.2,800 చెల్లించేందుకు మాత్రం చివరి తేదీని పొడిగించలేదు. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్ష ఫీజును సెపె్టంబర్ 21 న రాత్రి 11:59 గంటలలోపు మాత్రమే చెల్లించాలి.
Published date : 21 Sep 2021 03:45PM