Skip to main content

JEE Advanced: జేఈఈ ‘అడ్వాన్స్ డ్‌’కి ఇవి ధరించి రావొద్దు: ఐఐటీ ఖరగ్‌పూర్‌

దేశంలోని ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ డ్‌–2021ను సజావుగా పూర్తి చేసేందుకు నిర్వహణ సంస్థ ఖరగ్‌పూర్‌ ఐఐటీ పగడ్బందీ ఏర్పాట్లు చేపడుతోంది.
JEE Advanced
జేఈఈ ‘అడ్వాన్స్ డ్‌’కి ఇవి ధరించి రావొద్దు: ఐఐటీ ఖరగ్‌పూర్‌

ఎక్కడా ఎలాంటి లోపాలకు, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జేఈఈ మెయిన్ నాలుగో విడత పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మెయిన్ అక్రమాలపై సీబీఐ విచారణ జరుగుతుండడం, ఇప్పటికే ఆరుగురు అరెస్టుతో పాటు 20 మంది విద్యార్థులు డిబార్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్ డ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. జేఈఈ మెయిన్లో నిర్నీత అర్హత మార్కులు సాధించి అగ్రస్థానంలో ఉన్న 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్ డ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుంచి 15వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే ఖరగ్పూర్ ఐఐటీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. ఈ పరీక్ష అక్టోబర్ 3న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–2 జరగనుంది. జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి కేంద్రాన్ని రెండు పూటలా శానిటైజ్ చేయించడంతో పాటు అభ్యర్థులకు అందుబాటులో శానిటైజర్ను ఉంచనుంది. పరీక్ష కేంద్రాల సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేదంటే లోపలకు ప్రవేశం ఉండదు.

సూచనలు, నిబంధనలు ఇవీ..

  • జేఈఈ అడ్వాన్స్ డ్‌ అడ్మిట్‌ కార్డులో పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం చిరునామాతోపాటు పేరు, వర్గం, పుట్టిన తేదీ, లింగం తదితరాలు పొందుపరుస్తారు. అవి సరిగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి. వివరాల్లో తప్పులున్నట్లయితే సంబంధిత జోన్స్ కో ఆర్డినేటర్‌ను లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సంప్రదించాలి.
  • విద్యార్థులను తగిన పరిశీలన చేసి లోపలకు పంపనున్నందున చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి అభ్యర్థులు రిపోరి్టంగ్‌ సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
  • పారదర్శక బాటిల్‌తో నీటిని, పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • పరీక్ష ముగిసేంతవరకు అభ్యర్థులను పరీక్ష హాల్‌ నుంచి బయటకు అనుమతించరు.
  • మొబైల్, కాలిక్యులేటర్, రఫ్‌ పేపర్‌ను తీసుకెళ్లకూడదు. అలాగే చెవిపోగులు, కంకణాలు మొదలైన లోహాలతో చేసిన వస్తువులను ధరించి పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లరాదు.
  • మొత్తం ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ జేఈఈ అడ్వాన్స్ డ్‌–2021 అడ్మిట్‌ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. 

జేఈఈ అడ్వాన్స్ డ్ అడ్మిట్ కార్డ్తో పాటు చెల్లుబాటు అయ్యే ఏదో ఒక ఫొటో ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ /స్కూల్ ఐడీ/కాలేజ్ ఐడీ/పాన్ కార్డ్/పాస్పోర్ట్/ ఓటర్ ఐడీ)ను అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.

చదవండి: 

JEE: జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. ప్రారంభ తేదీ ఇదే..

JEE Main: జేఈఈలో మెరిసిన తెలుగుతేజాలు

Published date : 27 Sep 2021 03:05PM

Photo Stories