Skip to main content

JEE Main Session 2 : నేటి నుంచి జేఈఈ సెష‌న్ 2 ప్రారంభం.. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి..

ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఐఐటీ, నిట్ వంటి ఉన్నత సంస్థ‌ల్లో ప్ర‌వేశం పొందాలంటే విద్యార్థుల‌కు ఎన్‌టీఏ జేఈఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంది.
JEE main exam 2025 session 2 with rules and regulations  NTA conducts JEE Session 2 exam for engineering admissions

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఐఐటీ, నిట్ వంటి ఉన్నత సంస్థ‌ల్లో ప్ర‌వేశం పొందాలంటే విద్యార్థుల‌కు ఎన్‌టీఏ జేఈఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంది. అయితే, ఇప్ప‌టికే ఈనెల అంటే, జ‌న‌వ‌రి 22 నుంచి 24 వ‌ర‌కు సెష‌న్ 1 ప‌రీక్ష‌లు జ‌రిగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజ‌రైయ్యి, ప‌రీక్ష‌లు రాసారు. ఇప్పుడు సెష‌న్ 2లో భాగంగా నేటి నుంచి అంటే జ‌న‌వ‌రి 28, 29, 30వ తేదీ వ‌ర‌కు జేఈఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. నేడే తొలి పరీక్ష ప్రారంభం అయ్యింది.

JEE Main Question Paper Analysis : జేఈఈ ప్ర‌శ్న ప‌త్రాల విశ్లేష‌ణ‌.. పేప‌ర్లు ఎలా వ‌చ్చాయంటే..!!

హాల్‌టికెట్లు..

విద్యార్థుల‌కు జేఈఈ మెయిన్ సెష‌న్ 2కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను ఇప్ప‌టికే ఎన్‌టీఏ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి హాల్‌టికెట్ల‌ను ప్రింట్ తీసుకోవాలి.

JEE Main 2025 Hall Tickets : జేఈఈ మెయిన్ 2025.. ఈ మూడు తేదీల హాల్‌టికెట్లు విడుద‌ల..

రేపు, ఎల్లుండి రాసే ప‌రీక్ష కోసం విద్యార్థులు ముందుగానే త‌మ ప‌రీక్ష కేంద్రాన్ని ప‌రిశీలించుకోవాలి. స‌మ‌యానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ముందే జాగ్ర‌త్త ప‌డాలి.

నియ‌మ నిబంధ‌న‌లు..

1. విద్యార్థులు త‌ప్ప‌కుండా ప్ర‌క‌టించిన స‌మ‌యానికే కేంద్రానికి చేరుకోవాలి.
2. పరీక్ష కేంద్రానికి చేరుకోవ‌డం ఆల‌స్యం అయితే, విద్యార్థుల‌ను లోప‌లికి అనుమ‌తించ‌రు.
3. విద్యార్థులు ఎటువంటి ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను కేంద్రానికి తీసుకురాకూడ‌దు. వాటిని అనుమ‌తించ‌రు.
4. ప‌రీక్ష‌కు కావాల్సిన స్టేష‌న‌రీ వ‌స్తువులు, త్రాగునీరు వంటివి వెంట తెచ్చుకోవాలి.

No Entry : ఆల‌స్యం కావ‌డంతో నో ఎంట్రీ.. విద్యార్థులకు హెచ్చ‌రిక‌..!!

5. ప‌రీక్ష కేంద్రంలోని నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాలి.
6. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కి పాల్ప‌డ్డా ప‌రీక్ష కేంద్రం అధికారులు వెంట‌నే అదుపులోకి తీసుకుంటారు. 
7. తలుపులు మూసేసిన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వరు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 11:23AM

Photo Stories