టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. వచ్చే నెల 3 నుంచి 22 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి ప్రాక్టికల్ కేంద్రంలోని ఒక్కో గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పర్యవేక్షించడంతో పాటు ప్రశ్నపత్రం పంపిణీ, మూల్యాంకనం, మార్కుల కేటాయింపు అంశాలను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. ఎగ్జామినర్లతో ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మకై విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం లేకుండా, ఎగ్జామినర్లకు అరగంట ముందే ఆన్‌లైన్ ద్వారా పేపర్ పంపించడం, పరీక్ష పూర్తయ్యాక 2 గంటల్లోపే మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలు, మూల్యాంకనం విధానాలపై ఈనెల 19 నుంచి ఎగ్జామినర్లకు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. మార్చి 1 నుంచి జరిగే థియరీ పరీక్షలకు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ నిర్ణయించింది. దాదాపు 1,400 పరీక్ష కేంద్రాల్లో జరిగే థియరీ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో తరగతి గదుల్లో రెండు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
సీసీ కెమెరాలుంటేనే పరీక్ష కేంద్రం ఏర్పాటు..
సీసీ కెమెరాలు ఉన్న కేంద్రంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు టెన్‌త పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,300 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5.2 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్కో తరగతి గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది. ఈసారి ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీకి సంబంధించిన పేపర్లకు సంబంధించిన పరీక్షలను 14 నుంచి ప్రారంభించి, ప్రధాన టెన్‌త సబ్జెక్టుల పరీక్షలను తర్వాత నిర్వహించేలా టైంటేబుల్ ఖరారు చేసినందున, మార్చి 18 నుంచి ఇంటర్మీడియట్ కోసం (అప్పటికి ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు పూర్తవుతాయి) సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను టెన్‌తపరీక్షలకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

Published date : 20 Jan 2017 01:45PM