తెలంగాణలోఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు.
ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారాలను ఈనెల 23వ తేదీ వరకు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వచ్చే నెల 8 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ (అప్‌లోడ్) చేయవచ్చని తెలిపారు. ఆలస్య రుసుముతో వచ్చే నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకొని, అప్‌లోడ్ చేయవచ్చని వెల్లడించారు. మీసేవ/టీఎస్ ఆన్‌లైన్/ఏపీ ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ చేసుకుని దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని చెప్పారు. మరిన్ని వివరాలను డీఈవో కార్యాలయాల్లో, తమ వెబ్‌సైట్ www.telanganaopenschool.org లో పొందవచ్చని పేర్కొన్నారు.
Published date : 11 Aug 2016 02:29PM