Skip to main content

సెప్టెంబర్ 17 నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2019) మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు సెప్టెంబర్ 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సెప్టెంబర్10న ఓ ప్రకటనలో తెలిపింది.
రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే వారు కూడా నిర్ణీత తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే సెప్టెంబర్24 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించారు.

ఫీజు చెల్లింపు తేదీలు..
  • 17-9-2018 నుంచి 24-10-2018: తఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు
  • 25-10-2018 నుంచి 8-11-2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు
  • 9-11-2018 నుంచి 26-11-2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు
  • 27-11-2018 నుంచి 11-12-2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు
  • 12-12-2018 నుంచి 2-1-2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
  • 3-1-2019 నుంచి 21-1-2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
  • 22-1-2019 నుంచి 4-2-2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు

ఫీజు వివరాలు..
  • జనరల్, వొకేషనల్ థియరీ పరీక్షల ఫీజు రూ.460
  • థియరీ, ప్రాక్టికల్ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620
  • బిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.170
  • బిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120
  • మ్యాథ్స్/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460
  • హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్ రాస్తే ఫీజు రూ.1,050
  • ఇదివరకే పాసైన సైన్స్ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్ రాస్తే ఫీజు రూ.1,200
Published date : 11 Sep 2018 03:12PM

Photo Stories