ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు అడ్మిషన్ల క్రేజీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
గతేడాది జూలై 31వ తేదీ నాటికి 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 89 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, ఈసారి జూలై 31వ తేదీ నాటికి 94,523 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఆగస్టు 1వ తేదీ నాటికి ఆ సంఖ్య 95 వేలు దాటింది. ఇంటర్మీడియట్ రెండో దశ ప్రవేశాలు ఆగస్టు 31వ తేదీతో ముగియనున్నాయి. ఈలోగా టెన్‌త అడ్వాన్‌సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో మరో 25 వేల మంది ప్రభుత్వ కాలేజీల్లో చేరతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈసారి విద్యార్థుల సంఖ్య 1.20 లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు. జూలై 31వ తేదీ నాటికి 75,654 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో చేరగా, 18,869 మంది విద్యార్థులు వొకేషనల్‌లో చేరారు.
Published date : 02 Aug 2019 03:46PM