Skip to main content

పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సాక్షి, అమరావతి : ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు.
సచివాలయంలోని ఆయన చాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మీడియాకు వివరించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 18 వరకు, పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు గుర్తించిన సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు గతేడాది కంటే 35,050 మంది విద్యార్థులు అధికంగా హాజరు కానున్నారని, 1,444 సెంటర్లల్లో 10,28,904 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌ను 982 సెంటర్లలో జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నామని చెప్పారు. పదోతరగతి పరీక్షలకు 6,17,065 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, 133 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్టు వివరించారు. 13 సెంటర్లలో స్పాట్ వాల్యుయేషన్ జరపనున్నట్టు వివరించారు.
Published date : 09 Dec 2016 02:39PM

Photo Stories