Skip to main content

‘నామినల్ రోల్స్’ సవరణకు అవకాశం

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు సరిచేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు అవకాశం కల్పించినట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డు (టీఎస్‌బీఐఈ) ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మళ్లీ ఎటువంటి గడువు పొడగింపు ఉండదని పేర్కొంది. మరిన్ని వివరాలకు టీఎస్‌బీఐఈ వెబ్‌సైట్ bie.telangana.gov.in చూడాలని సూచించింది.
Published date : 13 Dec 2018 01:50PM

Photo Stories