Skip to main content

మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.
మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్ 1తో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి.

జూన్ మూడో వారంలో ఫలితాలు !
ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్ ప్రాసెస్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరవుతారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదీ...

తేదీ

ఫస్టియర్ (ఉ. 9:00- మ. 12:00)

సెకండియర్ (మ. 2:30- సా. 5.30)

25-05-2019

సెకండ్ లాంగ్వేజ్-1

సెకండ్ లాంగ్వేజ్-2

26-05-2019

ఇంగ్లిష్-1

ఇంగ్లిష్-2

27-05-2019

గణితం-1ఏ, బోటనీ-1
సివిక్స్-1, సైకాలజీ-1

గణితం-2ఏ, బోటనీ-2
సివిక్స్-2, సైకాలజీ-2

28-05-2019

గణితం-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1

గణితం-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2

29-05-2019

ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1

ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2

 

క్లాసికల్ లాంగ్వేజ్-1

క్లాసికల్ లాంగ్వేజ్-2

30-05-2019

కెమిస్ట్రీ-1, కామర్స్-1

కెమిస్ట్రీ-2, కామర్స్-2

 

సోషియాలజీ-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్1

సోషియాలజీ-2, ఫైన్‌ ఆర్ట్స్-2, మ్యూజిక్-2

31-05-2019

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-1 (బైపీసీ)

జియోలజీ-2, హోమ్‌సైయి-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-2 (బైపీసీ)

01-06-2019

మాడ్రన్ లాంగ్వేజ్-1, జియోగ్రఫీ-1

మాడ్రన్ లాంగ్వేజ్-2, జియోగ్రఫీ-2


03-06-2019 ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష (ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు)
04-06-2019 ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
జూన్ 7-10 ప్రాక్టికల్ పరీక్షలు (మార్నింగ్ సెషన్ 9-12 వరకు, ఆఫ్టర్‌నూన్ సెషన్ 2-5 వరకు)
Published date : 29 Apr 2019 12:52PM

Photo Stories