Skip to main content

మార్చి 4 నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డ్ డిసెంబర్ 2న ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 23 వరకు వీటిని నిర్వహించనున్నారు.
ఈ మేరకు బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు. ఒకేషనల్ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి. ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు.

ఇంటర్ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టికల్ గెడైన్స్... కొరకు క్లిక్ చేయండి.

ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
తేదీ ఫస్టియర్ తేదీ సెకండియర్
మార్చి 4 ద్వితీయ భాష పేపర్-1 మార్చి 5 ద్వితీయ భాష పేపర్-2
మార్చి 6 ఇంగ్లిష్ పేపర్-1 మార్చి 7 ఇంగ్లిష్ పేపర్-2
మార్చి 9 మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, మార్చి 11 మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ,
బోటనీ పేపర్-1, బోటనీ పేపర్-2
సివిక్స్ పేపర్-1, సివిక్స్ పేపర్-2
మార్చి 12 మ్యాథమెటిక్స్ పేపర్-1బి, మార్చి 13 మ్యాథమెటిక్స్ పేపర్-2బి
జువాలజీ పేపర్-1, జువాలజీ పేపర్-2,
హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2
మార్చి 14 ఫిజిక్స్ పేపర్-1, మార్చి 16 ఫిజిక్స్ పేపర్-2,
ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 17 కెమిస్ట్రీ పేపర్-1 మార్చి 18 కెమిస్ట్రీ పేపర్-2
కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2
సోషియాలజీ పేపర్-1 సోషియాలజీ పేపర్-2
ఫైన్ ఆర్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-1 ఫైన్ ఆర్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-2
మార్చి 19 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 మార్చి 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
లాజిక్ పేపర్-1 లాజిక్ పేపర్-2
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ బ్రిడ్జికోర్సు మ్యాథ్స్
పేపర్-1 (బైపీసీ వారికి) పేపర్-2 (బైపీసీ వారికి)
మార్చి 21 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 23 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2
జాగ్రఫీ పేపర్-1 జాగ్రఫీ పేపర్-2
Published date : 03 Dec 2019 02:34PM

Photo Stories