Skip to main content

మార్చి 30 నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
తిరిగి జూన్ 1న కాలేజీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సెలవుల కాలంలో తరగతులు నిర్వహించడానికి, ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు పాఠశాలలకు ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులుగా పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో 12వ తేదీన చివరి పని దినంగా అమలు కానుంది. జూన్ 1న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం ఉంటుందని.. అధికారులు, ప్రధానోపాధ్యాయులు అందుకు సిద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Published date : 26 Mar 2019 01:29PM

Photo Stories