Skip to main content

మార్చి 19న ఉదయం 9 గంటలకు ఇంటర్ పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వచ్చే నెల 9న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్-2బీ, హిస్టరీ పేపరు-2, జువాలజీ పేపరు-2, వొకేషనల్ పేపరు-2 పరీక్షలను మార్చి 19కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఆ పరీక్షలను 19న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు కేటాయించిన పాత పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు ఉంటాయని వివరించింది.
Published date : 16 Feb 2017 03:02PM

Photo Stories