Skip to main content

కెమిస్ట్రీలో ఎక్కువ ఫెయిల్

సాక్షి, అమరావతి: ఏపీ ఇంటర్ ఫలితాల్లో అత్యధిక శాతం మంది కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యారు. ఈ సబ్జెక్టులో 3,58,429 మంది పరీక్ష రాయగా 41,904 మంది తప్పారు.
మేథమెటిక్స్ 2బీలో 41,270 మంది, 2ఏలో 37,909 మంది, ఫిజిక్స్‌లో 29,648 మంది ఫెరుులయ్యారు. సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లోనూ ఫెయిలైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఆంగ్లంలో 29,813 మంది ఫెరుులయ్యారు.

ఇంగ్లిషు సబ్జెక్టు రాసినవారే ఎక్కువ..
ఇంటర్ ద్వితీయలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఆంగ్లం సబ్జెక్టు రాశారు. ఇంగ్లిషు సబ్జెక్టును 4,84,809 మంది రాయగా 4,54,994 మంది పాసయ్యారు. తెలుగు సబ్జెక్టు 1,80,982 మంది పరీక్ష రాయగా 1,65,575 మంది పాసయ్యారు. సంస్కృతం పేపర్‌ను 2,86,846 మంది రాశారు. వీరిలో 2,71,937 మంది ఉత్తీర్ణులయ్యారు.

సబ్జెక్టుల వారీగా పాస్ ఫెయిలైన వారి వివరాలు
సబ్జెక్టు పాస్ ఫెయిల్
ఇంగ్లిషు 4,54,994 29,813
తెలుగు 1,65,575 15,406
హిందీ 10,306 469
సంస్కృతం 2,71,937 14,909
మేథ్స్2ఏ 2,50,802 37,909
మేథ్స్2బీ 2,47,441 41,270
ఫిజిక్స్ 3,28,781 29,648
కెమిస్ట్రీ 3, 16,525 41,904
బోటనీ 73,516 8,698
జువాలజీ 73,816 8,398
ఎకనమిక్స్ 97,326 28,121
కామర్స్ 70,226 21,911
హిస్టరీ 18,200 3,676
సివిక్స్ 83,242 30,226
Published date : 13 Apr 2018 06:44PM

Photo Stories