కాలేజీలకు గుర్తింపు ఉంటేనే ప్రవేశాలు తీసుకోండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గుర్తింపు ఉన్న ఇంటర్ కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని, ముందస్తుగా అడ్మిషన్లు తీసుకొని ఇబ్బందులు పడొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలఅంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి ఎ.అశోక్‌కుమార్ సూచించారు.
ఇంటర్ కోర్సులకు సంబంధించి 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశాల ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించొద్దని కాలేజీలను ఆదేశించారు. గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల జాబితాను త్వరలోనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. కాలేజీలకు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
Published date : 22 Jan 2018 01:50PM