జనవరి28న ఎథిక్స్,హ్యూమన్ వ్యాల్యూ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు 28న ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూ పరీక్ష, 30న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు జనవరి 23 (గురువారం)నఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలకు వరకు ఉంటాయని పేర్కొంది. ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల లాగిన్‌ఐడీతో ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి నామినల్ రోల్స్, హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు అందజేయాలని సూచించింది. విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. గతంలో ఈ పరీక్షలు రాయనివారు, అర్హత సాధించనివారు పాత హాల్‌టికెట్‌తో పరీక్షలకు హాజరుకావొచ్చునని వెల్లడించింది.
Published date : 24 Jan 2020 01:46PM