జనవరి 28, 30 న ఇంటర్ నైతిక విలువలు, పర్యావరణ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జనవరి 28, 30 తేదీల్లో నైతిక విలువలు, పర్యావరణ సబ్జెక్టులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ స్వర్ణోత్సవ కార్యక్రమాలను జనవరి 24న విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
Published date : 22 Jan 2019 02:25PM